మెదక్ జిల్లాలో వర్షాలు దంచికొడుతున్నాయి. కాగా సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) పోతారెడ్డిపేట పెద్ద చెరువు వాగులో ముగ్గురు రైతులు చిక్కుకుపోయారు. పొలం పనుల నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా వాగు ఉదృతిలో చిక్కుకుపోయారు. రాత్రంతా రైతులు గోపాల్, సుదర్శన్, రాజు వాగులోనే ఉన్నారు. తమను రక్షించాలని అధికారులను వేడుకున్నారు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ముగ్గురు రైతులని రక్షించేందుకు రంగంలోకి SDRF టీం దిగింది. పోతారెడ్డిపేట వాగులో చిక్కుకున్న రైతులను బోటులో వెళ్లి…
Lineman Restores Power in Middle of Lake in Siddipet: గత 5-6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల చెట్లు నేలకొరగడం, భారీ గాలులకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు…
Siddipet Army Jawan Missing in Punjab: పంజాబ్‌లో సిద్దిపేట జిల్లాకి చెందిన ఆర్మీ జవాన్ మిస్ అయ్యాడు. అనిల్ (30) అనే జవాన్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను చనిపోతున్నట్టు చెప్పి అదృశ్యమయ్యాడు. అనిల్ ఆచూకీ గత ఆరు రోజులుగా లభించడం లేదు. అనిల్ కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులకు ఆర్మీ సిబ్బంది సమాచారం ఇచ్చింది. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. తమ కుమారుడిని వెతికి పెట్టాలని అనిల్ కుటుంబ సభ్యులు ఆర్మీ…
సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషిస్తూ, చంపేస్తామని బెదిరించాడంటూ గజ్వేల్ పీఎస్‌లో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్‌కుమార్ ఫిర్యాదు చేశారు.
MLA Kunamneni: సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే ఎడ్ల గురువా రెడ్డి14 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులతో చర్చలు నడిపేందుకు సిద్ధంగా ఉంది.. కానీ నక్సలైట్స్ తో చర్చలకి ముందుకు రావడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. BMW కారును కొనివ్వలేదన్న కారణంతో 21 ఏళ్ల యువకుడు జానీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివసించే కనకయ్యది మధ్య తరగతి కుటుంబం. కానీ.. కొద్దిరోజులుగా తనకు BMW కారు కావాలని కుమారుడు జానీ అడిగాడు.
దేశ సంపద, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని…
ఓ చిన్నారి మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన తల్లి చదివిస్తుందని కంటతడి పెట్టుకుంది. ఇక, ఆ చిన్నారి మాటలకి తల్లడిల్లిన ఆయన ఆ పాపను దగ్గరికి పిలిచి ఓదార్చాడు. సదరు చిన్నారితో పాటు హరీష్ రావు కంటతడి పెట్టుకున్నారు.
Bird flu: తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ఫ్లూ విజృంభిస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లాకు తాకింది ఈ వ్యాది. తొగుట మండలంలోని కాన్గల్ గ్రామ శివారులోని కోళ్ల ఫాంలో గత కొన్ని రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.