Komuravelli Mallanna Jatara 2025: కొంగు బంగారమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి జాతర ఈరోజు (జనవరి 19) నుంచి ప్రారంభం కానుంది. అయితే, సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారంతో ప్రారంభమై ఉగాదికి ముందు వచ్చే ఆదివారం నాడు ముగియనుంది. సుమారు రెండున్నర నెలల పాటు ఈ జాతర జరుగుతుంది. ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు కొనసాగిస్తారు. బోనాలతో భక్తులు ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేథ్యం సమర్పించనున్నారు. ఇక, పట్నం వేసి కల్యాణం జరిపించి తమ మొక్కులు తీర్చుకుంటారు. వీటిలో నాలుగు ప్రధాన ఘట్టాలతో పాటు మరో రెండు వేడుకలు కూడా జరుపుతారు.
Read Also: Nigeria Petrol Tanker Explosion: నైజీరియాలో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 70 మంది మృతి
అయితే, ఈ జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక, వీరిలో హైదరాబాద్‌కు చెందిన భక్తులే అత్యధికంగా ఉంటారు. అందుకే తొలి ఆదివారాన్ని పట్నం వారంగా పిలుస్తుంటారు. అలాగే, సోమవారం తోటబావి సమీపంలోని కల్యాణ వేదిక దగ్గర సొంత ఖర్చులతో పట్నం, అగ్నిగుండం కార్యక్రమాలు జరుపుతారు. ఈ వేడుకకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది ఆలయానికి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read Also: Bank Account: బ్యాంకు అకౌంట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ పని చేయకపోతే నష్టపోతారు!
ఇక, జాతర ముగింపు సందర్భంగా జరిగే అగ్నిగుండం కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ సారి మార్చి 23వ తేదీన రాత్రి దీన్ని నిర్వహించనున్నారు. భక్తులు రాత్రంతా జాగరణ చేసి.. కల్యాణ వేదిక దగ్గర అగ్నిగుండాలను ఏర్పాటు నిర్వహిస్తారు. 64 రోజుల పాటు సాగే ఈ జాతరకు సుమారు 25 లక్షల మందికి పైగా భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని ఆలయ ఈవో కురుమ రామాంజనేయులు వెల్లడించారు.
Read Also: Nigeria Petrol Tanker Explosion: నైజీరియాలో ఘోర ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలుడు.. 70 మంది మృతి
కాగా, ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం పెద్ద పట్నం అన్నమాట. ఈ సారి ఫిబ్రవరి 2వ తేదీన అర్ధరాత్రి దీన్ని నిర్వహించబోతున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం తరఫున నిర్వహించే ఈ కార్యక్రమం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. చౌదరీలు, ఒగ్గుపూజారుల ఆధ్వర్యంలో పంచరంగుల చూర్ణంతో 50 గజాల వైశాల్యంలో పట్నాలు వేయనున్నారు. దీనికి దాదాపు 3 గంటలకు పైగా టైం పడుతుంది. మల్లన స్వామి ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి పట్నంలో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేస్తారు. ముందుగా అర్చకులు పెద్దపట్నం దాటిన తర్వాత భక్తులు దాటి గర్భాలయంలోని స్వామివారి దర్శనం చేసుకుంటారు.