Ponnam Prabhakar : త్వరలోనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా, ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరాలనే సంకల్పంతో, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని ఆయన సూచించారు. గురువారం, సిద్ధిపేట జిల్లాలోని కోహెడ్ లో పర్యటించిన ఆయన, అక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశమై మాట్లాడారు. ఈ సమావేశంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం ప్రస్తుతం నుంచే పార్టీ నాయకులు వ్యూహాత్మకంగా పనిచేయాలని, ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల మధ్య లోతుగా పంచుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Mythri Movie Makers : పుష్ప-2 నిర్మాతలకు హై కోర్టులో ఊరట
ఆయన మాట్లాడుతూ, ‘‘పార్టీ కార్యకర్తలు ప్రజల కష్టాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని వారి మధ్య పోటీ చేయాలి. రైతులకు, వ్యవసాయానికి సహాయంగా ప్రభుత్వం రూ. 30 వేల కోట్లను కేటాయించిందని, తద్వారా రైతుల సంక్షేమాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే, మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌లో 250 పడకల హాస్పిటల్‌ను మంజూరు చేసినట్లు ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగా, అర్హులైన ప్రజలకు ‘‘ఇందిరమ్మ ఇండ్లు’’ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Game Changer : ‘గేమ్ ఛేంజర్’ టైటిల్ పై సెన్సార్ బోర్డు ఏమన్నదంటే ?