Harish Rao : ఆర్బీఐ నివేదికతో నిజాలు బయటపడ్డాయి.. అబద్దాలు తేలిపోయాయి..
- అబద్దాలతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలం గడుపుతోంది
- BRS పాలనపై కాంగ్రెస్ చేసినవన్నీ దుష్ప్రచారం అని తేలిపోయింది
- తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు.. దివ్యంగా వెలుగుతున్న రాష్ట్రం
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పులరాష్ట్రం అని ప్రచారం చేసింది : హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao : నిన్న ఆర్బీఐ ఇచ్చిన నివేదికతో నిజాలు బయటపడ్డాయి…అబద్ధాలు తేలిపోయాయని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష రావు అన్నారు. ఇవాళ ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్దాలను ప్రచారం చేస్తూ కాలం గడుపుతుందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తే నిజం నిప్పులాంటిది నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. పదేళ్ల మా పాలనపై కాంగ్రెస్ మంత్రులు, సీఎం రేవంత్ చేస్తున్న దుష్ప్రచారం అంతా తప్పని తేలిపోయిందని ఆయన అన్నారు. పదేళ్లలో ప్రతి రంగాన్ని కేసీఆర్ అభివృద్ధి పరిచారని RBI గణాంకాలు చెబుతున్నాయని, పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి రికార్డు సృష్టించిందన్నారు హరీష్ రావు. తెలంగాణ దివాలా రాష్ట్రం కాదు దివ్యంగా వెలుగుతున్న రాష్టమని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అప్పుల రాష్టం అని ప్రచారం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు.
LAC Border truce: చైనా ఫారెన్ మినిస్టర్‌తో భేటీ కానున్న అజిత్ దోవల్.. సరిహద్దులపై చర్చ..
Also Read
- Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
- YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
- Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
- OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
సీఎం లేని దివాలాని ప్రచారం చేసి మాపై బురద జల్లేందుకు ప్రయత్నించి ఆయనే బురద జల్లుకున్నారని, 7 లక్షల కోట్ల అప్పు అని ప్రచారం కాంగ్రేస్ మంత్రులు పదే పదే గోబెల్స్ చేశారన్నారు. 2014, 15 ఏడాది ముందే 72, 658 కోట్ల అప్పుని తెలంగాణకి గత కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చిందని, 2024 డిసెంబర్ 7 నుంచి మార్చి 2024 వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 15 వేల కోట్లు అప్పు చేసిందన్నారు. రెండు కలిపితే ఒక లక్ష 6 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వమే అప్పు చేసిందని, పదేళ్ల BRS హయాంలో 3, 22, 499 కోట్ల రూపాయల అప్పు మాత్రమే మేము చేశామన్నారు హరీష్ రావు. ఈ విషయాన్ని స్వయంగా RBI వెల్లడించిందని, ఇప్పటికైనా విషప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలన్నారు. ఉదయ్ స్కీంల మీద అప్పుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద నెడితే అది కూడా అప్పులో కలిపారని, విద్యుత్ ఉత్పత్తిలో 106 శాతం యూనిట్లకు పెంచామన్నారు. 82 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లు ఇచ్చి 105 శాతం పెంచామని హరీష్ రావు వ్యాఖ్యానించారు.
South India Shopping Mall: ఒంగోలులో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ శుభారంభం
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!