Hit and Run: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదు అయ్యింది. తెల్లవారుజామున బైక్ పై వెళ్తున్న ఇద్దరిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మృతులిద్దరు పోలీసులుగా గుర్తించారు. మృతులు సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు, గాడిచర్లపల్లి గ్రామంగా తెలిపారు. దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో వెంకటేష్, పరంధాములు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగే మారథాన్‌లో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
Read also: Road Accident: పల్నాడు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి!
కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించడంతో నడిరోడ్డుపై మృతదేహాలు చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. హైదరాబాద్ కు వెళ్లి వస్తామంటూ ఇద్దరు బయలుదేరి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారంటూ రోదించారు. వీరిని చూసిన స్థానికులు, పోలీసులు కంటతడిపెట్టారు. అయితే వీరిద్దరి వాహనాన్ని ఢీ కొట్టి వెళ్లిన వాహనం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఇద్దరు పోలీసుల మృతికి కారకులైన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వారు ఎంతటి వారైనా వదిలే ప్రశక్తి లేదన్నారు.
మరోవైపు గజ్వేల్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుళ్ల మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీస్ ఉద్యోగంపై నిబద్ధత కలిగిన ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబాలకి అండగా ఉంటానని.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Donald Trump: సిరియాలో ఉద్రిక్త పరిస్థితులు.. ట్రంప్ సంచలన ప్రకటన..