సిద్ధిపేట జిల్లా బండ తిమ్మాపూర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో కోకాకోలా కంపెనీని నిర్మించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ముఖ్య నేతలు పాల్గొన్నారు. సీఎం హోదాలో మొదటి సారి గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు వందల ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.
Read Also: KTM 250 DUKE Price: బంపర్ ఆఫర్.. కేటీఎం 250పై తగ్గింపు
ప్రారంభోత్సవం అనంతరం.. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, TGIIC చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కలిసి కోకాకోలా ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ క్రమంలో.. ముఖ్యమంత్రికి కోకాకోలా ప్రతినిధులు కంపెనీపై ప్రజంటేషన్ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. సీఎం పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి వర్గాన్ని లోపలికి అనుమతించకపోవడంతో ఆందోళన చేపట్టారు. కాగా.. కంపెనీ గేట్లను నెట్టుకుంటూ కార్యకర్తలు లోపలికి వచ్చారు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో.. పోలీసులతో నర్సారెడ్డి అనుచరులు వాగ్వాదానికి దిగారు. దీంతో.. పరిశ్రమలో గందరగోళం నెలకొంది. మరోవైపు.. సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడకుండానే బయటికొచ్చారు.