Ponnam Prabhakar: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని 15వ వార్డులో ప్రజా పాలన వార్డు సభను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో మంత్రిగా తమ జోక్యం ఉండదు.. న్యాయంగా అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని వెల్లడించారు. అధికారులు ప్రజా పాలన సభల్లో ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులను గుర్తించాలి అని తేల్చి చెప్పారు. ఇక, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరిగేలా సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నాం అన్నారు.
Read Also: Gay Marriage : స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు.. ఆసియాలోనే మూడవ దేశంగా థాయిలాండ్
ఇక, రెండు లక్షలకు పైగా ఇంకా రుణమాఫీ కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది.. ముందు అధికారుల దృష్టికి తన దృష్టికి సమస్యను తీసుకురండి అని ఆయన పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు అని మంత్రి పొన్నం చెప్పారు.