పాఠశాలలకు రెండ్రోజులు సెలవులు వచ్చాయి. నిన్న క్రిస్మస్, ఈ రోజు బాక్సింగ్ డే కావడంతో హాలీడేస్ వచ్చాయి. అయితే.. సరదాగా ఆడుకుందామనుకున్న ఓ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృత్యువు గాలిపటం రూపంలో వచ్చి ఆ బాలుడిని బలి తీసుకుంది. దీంతో.. ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Read Also: Hyderabad: బాచుపల్లిలో గన్‌తో యువకుల హల్చల్..
వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. గాలిపటం తెచ్చుకుందామని చెరువు దగ్గరికి వెళ్లిన బాలుడు.. గాలిపటం కోసం చెరువులోకి దిగాడు. దీంతో.. బాలుడికి ఈత రాకపోవడంతో తేజ గల్లంతయ్యాడు. అనంతరం.. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు.. చెరువు దగ్గరికి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహాయంతో బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు.
Read Also: Oppo Reno 12: మొబైల్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తున్న ఒప్పో