Sangareddy Crime: ఇన్స్టాగ్రామ్ లో యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
Telangana Crime: ఇటీవలి వ్యక్తులు తమ కుటుంబాన్నే చంపుకుంటున్న సంఘటనలు కుటుంబ వ్యవస్థ ఉనికిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. వృద్ధులు, అంగవైకల్యం ఉన్నవారు..
సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇన్‌స్టా గ్రామ్‌లో ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో.. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని బీ.ఫార్మసీ చదువుతోంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది.
Ganja In Sangareddy: తాజాగా గంజాయిని రవాణా చేస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని అందోల్ (మం) డాకూర్ శివారులో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల వాహన తనిఖీలు చేస్తుండగా ఒక్కసారిగా 3 కిలోల గంజాయిని పట్టుకున్నారు. బైక్ పై మోహియోద్దీన్ అనే వ్యక్తి గంజాయి తీసుకువెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బైక్ ని సీజ్ చేసి మోహియోద్దీన్ ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. Barber: ముఖంపై ఉమ్మేస్తూ మసాజ్ చేసిన బార్బర్.. వీడియో…
సాఫ్ట్వేర్ ఉద్యోగి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. మృతుడు సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌గా గుర్తించారు పోలీసులు. అతను విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో సమస్యలతో డిప్రెషన్లో ఉరేసుకొని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.
సంగారెడ్డి జిల్లా బీడీఎల్ బానూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిఐఎస్ఎఫ్ జవాన్ వెంకటేశ్వర్లు గన్ మిస్ ఫైర్ అయ్యి దుర్మరణం చెందాడు. రాత్రి విధులకు వెళ్లి ఉదయం తిరిగి వస్తుండగా సీఐఎస్ఎఫ్ వాహనంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బీడీఎల్ బానూరు పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నంద్యాల జిల్లా అవుకు మండలం జూనూతలకు చెందినవాసిగా తెలిపారు. గతంలో ప్రధాని మోడీ భద్రత టీమ్‌లో 2…
రైతుల్లో ఆశలు రేపిన నైరుతి రుతుపవనాలు అంతలోనే ఉసూరుమనిపించాయి. రెట్టించిన ఉత్సాహంతో ఖరీఫ్ సాగును ప్రారంభించిన అన్నదాతల ఆశలను ఆవిరి చేస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో ఆరుతడి పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. వాటర్ ట్యాంకర్లు అద్దెకు తీసుకొచ్చి పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Renovated Asian Nithiin Sitara is now open at Sangareddy: టాలీవుడ్ యువ నటుడు నితిన్ మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్‌లోకి ఎంటర్ అవుతున్నట్లు కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అది నిజమైంది. అగ్ర హీరోలు మహేష్‌బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్, రవితేజ బాటలోనే నితిన్ కూడా మల్టీప్లెక్స్ బిజినెస్‌లోకి అడుగు పెట్టాడు. కుర్ర హీరో ఏషియన్ సంస్థతో కలిసి ANS సినిమాస్ ఏషియన్ నితిన్ సితార అనే మల్టీప్లెక్స్ ప్రారంభించాడు.…
మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
Telangana Govt: ఒకటి నుండి 10 వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని, వర్క్ బుక్ లను విద్యార్థుల నుండి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.