Singur Project: సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతోంది. ఏడాది తర్వాత సింగూరు ప్రాజెక్టులోకి వరద రావడంతో పూర్తిగా నిండడంతో ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో 40,496 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి సామర్థ్యం 28.473 టీఎంసీలు. డ్యాం పూర్తి స్థాయికి చేరుకోవడంతో మంత్రి దామోదర రాజ నరసింహ గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించి గేట్లను ఎత్తారు. అంతకంటే ముందే మంజీరా నది డ్యాం గేట్లను ఎత్తివేసే అవకాశం ఉన్నందున మంజీరా నది తీర పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Read also: IT Minister Sridhar Babu: హైదరాబాద్ లో 200 ఎకరాల్లో AI సిటీ నిర్మాణం.. ఇది మా డ్రీమ్ ప్రాజెక్టు..
అయితే గత ఏడాది అలల తాకిడికి కరకట్ట లోపల ఉన్న రివిట్‌మెంట్ దెబ్బతింది. తర్వాత సంచుల్లో చిన్న సైజు కంకర చిప్‌లను నింపి అడ్డుగా ఉంచారు. అయితే బస్తాలన్నీ చిరిగిపోయి కంకర చిప్స్ చెల్లాచెదురుగా పడ్డాయి. ఇప్పుడు మళ్లీ రిజర్వాయర్‌లో అలల ఉధృతి పెరిగింది. ఈసారి కంకర చిప్స్ బస్తాలతో తాత్కాలిక మరమ్మతులు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమయాభావం వల్ల కంకర చిప్స్ బస్తాలతో తాత్కాలిక మరమ్మతులకే పరిమితమైనా శాశ్వత మరమ్మతులకు శ్రీకారం చుట్టలేదు. ఈసారి కూడా తాజా కంకర చిప్‌లను నింపి దెబ్బతిన్న రివెట్‌మెంట్ వద్ద ప్రవేశపెట్టారు.
CM Revanth Reddy: ఎన్నికల ముందు డిక్లరేషన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత..