ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి అమాయక ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఏర్పడ్డ స్నేహం వల్ల ఇబ్బందులకు పాల్పడుతూ తనను ప్రేమించాలంటూ ఒకటే నరకయాతన చూపిస్తున్నారు. దీంతో.. ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పేందుకు భయపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజుకు ఏదొక చోట జరుగుతూనే ఉన్నాయి. నిందితులకు ఎన్ని కఠిన శిక్షలు విధిస్తున్నా.. మృగాళ్ల తీరులో ఏ మాత్రం చలనం లేకుండా పోతుంది. తాజాగా.. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుంది.
Read Also: Train Accident: నేడు రెండు రైలు ప్రమాదాలు.. పశ్చిమ బెంగాల్, దక్షిణ గోవాలో పట్టాలు తప్పిన రైళ్లు..
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా గుమ్మదిదల మండలం దోమడుగు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువకుడు ఇన్స్టా గ్రామ్లో ప్రేమ పేరుతో యువతిని వేధింపులకు గురి చేశాడు. దీంతో.. ఆకతాయి వేధింపులు భరించలేక యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకుంది. తేజస్విని బీ.ఫార్మసీ చదువుతోంది. తన ఇంటివద్ద నాలుగో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో.. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో యువతి మృతి చెందింది. తనను ప్రేమించాలంటూ అదే గ్రామానికి చెందిన యువకుడు అతని స్నేహితులతో కలిసి తరచూ విద్యార్థినినీ, ఆమె తల్లిని బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Vivo V40 Pro Price: 50ఎంపీ సెల్ఫీ కెమెరా, 5500 బ్యాటరీ.. వివో నుంచి సూపర్ స్మార్ట్‌ఫోన్స్!