సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ కెమికల్ పరిశ్రమలో పేలుడు వల్ల గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న వారిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, సునీత లక్ష్మారెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి పరామర్శించారు.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం నాడు సాయంత్రం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ దగ్గర ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి మంటలు చేలరేగడంతో అక్కడే పని చేస్తున్న పలువురు కార్మికులు ఎగిరి పడ్డారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని పర్యటనకు చక చక ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పటేల్ గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ లో ప్రధాని బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, సంగారెడ్డి వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారు.
Reactor Blast in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలో ఉన్న సీఎంహెచ్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది.
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 10 రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు వచ్చింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. కాసేపటి క్రితం పలు చోట్ల భూమి కంపించింది. ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
nganwadi Eggs: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందించే అంగన్‌వాడీ కోడి గుడ్లను అంగట్లో అమ్మడానికి పెట్టిన వైనం వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండల కేంద్రంలో సంచలనంగా మారింది.
Damodar Raja Narasimha: సంగారెడ్డి జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. జిల్లాలో పలు కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అందిస్తామనే నమ్మకం కాంగ్రెస్ పార్టీకి ఉందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గత వ్యవస్థలో తప్పులు జరిగాయని, వాటిని తాము సరిదిద్దుతామన్నారు. కొత్త ప్రభుత్వం, కొత్త ఆశలు, కొత్త నడవడికలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా పనిచేస్తుందని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజాపాలన జిల్లాస్థాయి సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంకు ముఖ్య అతిథిగా మంత్రి దామోదర రాజనర్సింహ వచ్చారు. Also Read: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్…
సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నాలుగు రోజుల వ్యవధిలో జిల్లాలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఆందోళణ చెందుతున్నారు. ఈ నాలుగు కేసులలో ఒకరి రికవరి అయినట్టు జిల్లా వైద్యాధికారలు తెలిపారు. దీంతో ప్రస్తుతం సంగారెడ్డిలో మూడు యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో జిల్లాలోని రామచంద్రాపురంలో రెండు, కంది (మం) మామిడిపల్లిలో ఒకరికి కరోనా పాజిటివ్గా ఉంది. దీంతో కరోనా సోకిన వారి కాంటాక్ట్ హిస్టరీని అధికారులు పరిశీలిస్తున్నారు. వారు ఎక్కడికి వెళ్లారు,…