సంగారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిన్న (బుధవారం) కిడ్నాప్ అయిన శిశువు సేఫ్‌గా ఉంది. హైదరాబాద్‌లో చిన్నారి ఆచూకీ లభ్యమైంది. కిడ్నాపర్ల నుంచి పాపని రక్షించి పోలీసులు సంగారెడ్డికి తీసుకువచ్చారు. కాగా.. శిశువు కిడ్నాప్ అయిన 30 గంటల్లోనే కేసును సంగారెడ్డి పోలీసులు ఛేదించారు. అయితే.. నిన్న సినిమా స్టైల్లో శిశువుని ప్లాన్‌తో కిడ్నాప్ చేసారు. నలుగురు మహిళలు పక్కా ప్రొఫెషనల్‌గా వచ్చి శిశువును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయింది. దీంతో.. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా వారిని గుర్తించి పట్టుకున్నారు. కాగా.. చిన్నారి సురక్షితంగా దొరకడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. మరోవైపు.. తమ చిన్నారిని సేఫ్ గా తీసుకొచ్చినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా.. ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి రేపు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.