Sangareddy Crime: ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. తను కూడా ఆమెను ప్రేమించానని.. కానీ తేజస్విని చనిపోయిందని తెలిపాడు. నేను కూడా తనదగ్గరకు వెళుతున్నా అంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
Read also: CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు అన్నంత పని చేసారుగా.. ఏమిచేశారంటే..?
ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన యువకుడు శ్రీహరి వేధింపులతోనే యువతి తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే నిందితుడు శ్రీహరి కూడా ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్ పరిది బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తేజస్విని ఆత్మహత్య తర్వాత.. శ్రీహరి కూడా సూసైడ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. కానీ.. శ్రీహరిని గమనించిన కుటుంబ సభ్యులు సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించారు. శ్రీహరికి చికిత్స అందిస్తుండగానే.. తేజస్విని మరణ వార్తతో భావోద్వేగానికి గురై.. ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. అనంతరం సూసైడ్ నోట్ రాశాడు. తేజు నీ దగ్గరికే వస్తున్న.. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అంటూ శ్రీహరి నోట్ స్టార్ట్ చేశాడు. ప్లీజ్ మా ఇద్దరికీ మీ రందరూ కలిసి న్యాయం చేయండని తెలిపారు. తేజూ.. నీ దగ్గరికి నేను వస్తున్నా అని తెలిపాడు.
Read also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
నేను చనిపోయాక అందరికీ నిజం తెలుస్తుందని, 7వ తేదీన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నామని లెటర్ లో పేర్కొన్నాడు. నాది వన్ సైడ్ లవ్ కాదు.. ఒకరంటే ఒకరికి ప్రాణమని తెలిపాడు. నా తేజు నాకోసం పైన ఎదురు చూస్తుంటది.. నేను చనిపోయాక మన పిక్స్ బయటకు వస్తాయని లెటర్ లో తెలిపాడు. నా ఫ్రెండ్స్, అన్నలు అందరూ నాకోసం ఫైట్ చేయండి… ఇదే నా కోరిక అంటూ లెటర్ లో శ్రీహరి పేర్కొన్నాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరు షాక్ కి గురయ్యారు. తేజస్విని చనిపోయిన రెండు రోజులకే శ్రీహరి కూడా సూసైట్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం పై పలు అనుమానాలు వ్యక్తమతున్నాయి. అయితే తేజస్వినితో శ్రీహరి అంత గాఢంగా ప్రేమించి ఉంటే ఎందుకు కాదన్నట్టు. అయితే తేజస్విని ఆత్మహత్య చేసుకున్న కథలో ఏదో మతలబు ఉందని పోలీసులు భావిస్తున్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదా? అందుకని తేజస్విని, శ్రీహరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిద్దరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కుటుంబ పెద్దలు ఎవరైనా ఉన్నారా ? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Tummala Nageswara Rao: హరీష్ రావు ఆరోపణలపై మంత్రి తుమ్మల కంట కన్నీరు..