మూడు నెలలుగా రష్యా ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలు, గ్రామాలు సర్వనాశనం అవుతున్నాయి. అయినా అటు రష్యా అధినేత పుతిన్, ఇటు ఉక్రెయన్ అధ్యక్షుడు జెలన్ స్కీ తగ్గడం లేదు. బలమైన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందనుకున్న ఉక్రెయిన్, అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న సైనిక, వ్యూహాత్మక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రాజధాని కీవ్ ను ఆక్రమించుకోవాలని అనుకున్న రష్యాను నిలువరించారు. దీంతో…
ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించినప్పటి నుంచి అమెరికా సహా అనేక పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా యూరోపియన్ యూనియన్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొరతని అధిగమించేందుకు.. వీలైనంత త్వరగా ఇతర సరఫరా మార్గాల్ని వెదుక్కోవాలని, సంప్రదాయేతర ఇంధన…
ప్రపంచ అగ్రనేత, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఇంకో మూడేళ్లే బతుకుతాడా..? ఇంటెలిజెన్స్ అధికారులు, గూడాచారులు రిపోర్ట్ ఆధారంగా మూడేళ్లకు మించి పుతిన్ బతకరని తెలుస్తోంది. తాజాగా పుతిన్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ‘ది ఇండిపెండెంట్’ ఒక నివేదికలో తెలియజేసింది. అతను మూడేళ్లు మించి జీవించి ఉండరని మాజీ రష్యా ఇంటెలిజెన్స్ అధికారి చెప్పినట్లు ఇండిపెండెంట్ ఒక కథనంలో తెలిపింది. పుతిన్ తీవ్రమైన కాన్సర్ తో బాధపడుతున్నట్లు దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడిచింది. రష్యన్ ఫెడరల్…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న వేళ పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు అండగా నిలుస్తున్న వేళ రష్య కీలక టెస్ట్ నిర్వహించింది. ‘జిర్కాన్’ హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్య ప్రకటించింది. బారెంట్స్ సముద్రంలోని అడ్మినరల్ గోర్ష్ కోవ్ యుద్ధనౌక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. ఇది ఆర్కిటిక్ ప్రాంతంలో వైట్ సీలోని లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో చేధించిందని రష్య రక్షణ మంత్రిత్వ శాక తెలిపింది. కొత్త ఆయుధాల పరీక్షల్లో భాగంగా ఈ టెస్ట్ నిర్వహించినట్లు…
రష్యా ఉక్రెయిన్ పై దండయాత్ర ప్రారంభించి మూడు నెలలు కావస్తోంది. అయినా యుద్ధంలో వెనక్కి తగ్గడం లేదు రష్యా. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో రాజధాని కీవ్ ను హస్తగతం చేసుకుందామని అనుకున్న రష్యా బలగాలకు ఎదురొడ్డి పోరాడింది ఉక్రెయిన్. కీవ్ ను స్వాధీనం చేసుకోవడం కుదరకపోవడంతో రష్యా, ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి మళ్లీ యుద్ధాన్ని మొదలు పెట్టింది. డాన్ బాస్, లుగాన్స్క్ ప్రాంతాలను ఆక్రమించుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. దీంట్లో భాగంగానే…
ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేస్తోంది. డాన్బాస్ ప్రాంతంలోని మూడు కమాండ్ పాయింట్లతో పాటు సైనిక సామాగ్రి నిల్వ ఉన్న 13 స్థావరాలు, నాలుగు మందుగుండు డిపోలను ధ్వంసం చేసింది. దక్షిణ ఉక్రెయిన్లోని మైకోలైవ్ నగరానికి 100 కిలోమీటర్ల దూరంలో మోహరించిన మొబైల్ యాంటీ-డ్రోన్ వ్యవస్థను రష్యా రాకెట్లు దెబ్బతీసినట్టు సమాచారం. ముఖ్యంగా ఉక్రెయిన్ సైనిక స్థావరాలే టార్గెట్గా రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయి. కాగా, ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టి దాదాపు నాలుగు నెలలు…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయి దాదాపుగా నాలుగో నెలకు చేరింది. ఇరు దేశాలు కూడా వెనక్కి తగ్గడం లేదు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్ నిలబడుతోంది. రష్యా, ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన తర్వాత నుంచి అమెరికా, నాటో దేశాలు ఆర్థికంగా, సైనికంగా సహాయపడుతున్నాయి. రష్యాను ధీటుగా ఎదుర్కొనేందు స్ట్రింగర్ మిసైళ్లు, ఇతర ఆయుధాలను, కమ్యూనికేషన్ వ్యవస్థతో పాటు సైనిక వ్యూహాలను అందిస్తున్నాయి అమెరికా, నాటో దేశాలు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ కు 40 బిలియన్…
కార్తీ కథానాయకుడిగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన `ఖైదీ` చిత్రం ఇప్పుడు రష్యాలో ‘ఉస్నిక్’ పేరుతో గ్రాండ్గా విడుదలైంది. సుమారు 121 కేంద్రాలలో 297 థియేటర్లలో ఈ సినిమాను గురువారం నుండి ప్రదర్శిస్తున్నట్టు నిర్మాతలు తెలిపారు. ఈ తమిళ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కార్తీ ప్రధాన పాత్రలో నరేన్, అర్జున్ దాస్, బేబీ మోనికా తదితరులు ఇతర పాత్రలలో నటించారు. ఇండియాలో ఒక…
రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ ఎంత హెచ్చరించినా… నార్డిక్ దేశాలు స్వీడన్, ఫిన్లాండ్ నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్( నాటో) చేరడానికే మొగ్గు చూపాయి. తాజాగా బుధవారం నాటోలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఈ రెండు దేశాలు దరఖాస్తు చేసుకున్నట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్ బర్గ్ ధ్రువీకరించారు. నాటోలో చేరితే మాస్కో నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని రష్యా హెచ్చరించానా ఈ రెండు దేశాలు వెనక్కి తగ్గలేదు. ఇదిలా ఉంటే స్వీడన్, ఫిన్లాండ్…