Putin: మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు.. 30 ఏళ్లు చిన్నదైన ప్రేయసితో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ అగ్రనేతల్లో ఒకరైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి తండ్రి కాబోతున్నాడనే వార్తలు ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. 69 ఏళ్ల పుతిన్ తన కన్న 30 ఏళ్లు చిన్నదైన అలీనా కుబేవా(39)తో రహస్య సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరికి ఇద్దరు సంతానం ఉన్నారు. అయితే మరోసారి అలీనా కుబేవా గర్భంతో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే పుతిన్ కు అమ్మాయి జన్మిస్తుందని తెలుస్తోంది. అయితే కుబేవా గురించి రహస్యాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. కుబేవాకు 2015లో స్విట్జర్లాండ్ లో ఓ కుమారుడు జన్మించాడని.. ఆ తరువాత 2019లో మాస్కోలో మరో కుమారుడికి జన్మనిచ్చినట్లు సమాచారం.

Also Read
- Pakistan Army Plane Crash: పాకిస్థాన్‌లో కూలిన ఆర్మీ శిక్షణ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేత జిమ్నాస్ట్ అయిన అలీనా కుబేవా, పుతిన్ ల బంధం చాలా రహస్యంగా ఉంది. వీరి గురించి ఎప్పటికప్పుడు పుకార్లు వస్తూనే ఉంటాయి. అలీనా రష్యాలో ప్రముఖ వ్యక్తుల్లో ఒకరు. ఈమె ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా గ్రూప్ కు బాస్ అని కూడా సమాచారం. అలీనా కుబేవా ఒలింపిక్స్ లో రెండు పథకాలను గెలుచుకుంది. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో స్వర్ణం గెలుచుకోగా.. 2000 సిడ్నీ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకుంది. ఇప్పటి జిమ్నాస్టిక్స్ లో 14 ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు ఉన్నాయి. ఒలింపిక్స్ సమయంలోనే అలీనా, రష్యా అధినేత పుతిన్ మనసును గెలుచుకుందని చెబుతుంటారు. ఆ తరువాత నుంచే వీరిద్దరి బంధం బలపడిందని కథలుగా చెప్పుకుంటారు.
Read Also:Vijayendra prasad: ‘రజాకార్ ఫైల్స్’ మూవీ రావడం ఖాయమా?

పుతిన్ మొదటి బార్య లియుడ్మిలా. వీరిద్దరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 37 ఏళ్ల మారియా ఫాసెస్ సైంటిస్ట్. ఈమె డచ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. రెండో కుమార్తె 35 ఏళ్ల కాటెరినా టిఖోనోవా. ఈమె మాస్కో స్టేట్ యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ రీసెర్చ్ ఆఫ్ కాంప్లెక్స్ సిస్టమ్స్ డైరెక్టర్. రాక్ అండ్ రోల్ డ్యాన్సర్గాను టిఖోనోవా ప్రసిద్ధి చెందింది. ఇదే కాకుండా పుతిన్ కు రష్యా మల్టీ మిలియనీర్ సెత్లానా క్రివోనోగిక్తో కూడా వివాహేతర సంబంధం ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. వీరిద్దరికి ఓ కుమార్తె కూడా ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
-
AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!