అమెరికా అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం. అలాంటి అమెరికా దాదాపు రెండేళ్లు కరోనాతో విలవిల్లాడింది. ప్రపంచంలో అత్యధిక కరోనా మరణాలు.. అక్కడే నమోదయ్యాయి. ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యం కోలుకుంటోంది. కరోనా ఎఫెక్ట్ తగ్గి.. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనాతో కుదేలైన ఆర్ధిక వ్యవస్థ మళ్లీ గాడిన పడుతుందని.. అంతా మామూలు స్థితికి చేరుకుంటుందని అంతా భావించారు. అయితే అనుకున్నది ఒకటి అయితే.. ఇప్పుడు జరుగుతోంది మరొకటి. కరోనా సంక్షోభం తర్వాత గాడినపడుతుందనుకున్న అమెరికా ఆర్థిక…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. నగరాలు, పట్టణాలు, గ్రామాలు.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో విధ్వంసం అయ్యాయి.. మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన తప్పడం లేదు.. ఇదే సమయంలో.. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.. ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, దైపాక్షి.. ఇలా అన్ని రకాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా ఆ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై నిషేధం విధించింది.. పుతిన్…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది… ఉక్రెయిన్ నుంచి రష్యాకు తీవ్ర స్థాయిలో ప్రతిఘటన తప్పడంలేదు.. రష్యా సరిహద్దుల్లోని ఖార్కివ్‌ను మళ్లీ ఉక్రెయిన్ చేజిక్కించుకుంది. రష్యా దళాల్ని ఉక్రెయిన్ సైన్యం సమర్థవంతంగా వెనక్కి పంపిస్తోంది. సిటీ కోసం జరిగిన పోరులో తాము గెలిచినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఖార్కివ్ నుంచి శత్రు దేశ దళాలు వెనుదిరుగుతున్నట్లు తెలిపింది. ఐతే ఖార్కివ్ సమీప ప్రాంతాలపై రష్యా ఇంకా బాంబు దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖార్కివ్‌కు పది కిలోమీటర్ల దూరంలో…
*ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి తిరుమల పర్యటన. ఇవాళ శ్రీకాళహస్తీర్వుడి దర్శనం, తిరుపతి గంగమ్మకు సారెని సమర్పించనున్న స్వామీజీ. * నేడు రాయలసీమ యూనివర్శిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కు పిలుపు. రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆనందరావు ను రీకాల్ చేయాలని డిమాండ్ *నేడు రాజ్ భవన్ ను ముట్టడించనున్న రాయలసీమ విద్యార్థి సంఘాలు. అనుమతులు లేవు ఆంక్షలు అతిక్రమిస్తే అరెస్ట్ చేస్తాం…
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల మధ్య రాజధాని కీవ్ లో మూతపడిన భారత రాయబార కార్యాలయం తిరిగి ప్రారంభం కానుంది. రష్యా దాడి తీవ్రమవుతున్న సమయంలో భారత రాయబార కార్యాలయాన్ని మార్చి 13 పోలాండ్ లోని వార్సాకు తరలించారు. తాజాగా మే 17 నుంచి కీవ్ లో ఎంబసీని తెరవనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి పనిచేసేందుకు వివిధ పాశ్చాత్య దేశాలు సమాయత్తం అవుతున్న వేళ భారత్ కూడా తన ఎంబసీని ఉక్రెయిన్…
ఉక్రెయిన్ – రష్యా యుద్ధ పరిణామాలు భారత్ నే కాదు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం వల్ల ఇప్పటికే భారత్ లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే మిడిల్ ఈస్ట్ కంట్రీ ఇరాన్ కు కూడా ఉక్రెయిన్ సెగ తగిలింది. ఆ దేశంలో పలు నిత్యావసరాల ధరలు 300 శాతం పెరిగాయి. ఇరాన్ ప్రభుత్వం గురువారం నాడు చికెన్, పాలు, గుడ్ల వంటి ప్రధాన నిత్యావసరాల ధరలను…
అంతర్జాతీయ రాజకీయాలు క్షణక్షణం మారుతున్నాయి. నార్డిక్ దేశమైన ఫిన్లాండ్ తీరుపై రష్యా మండిపడుతోంది. ఫిన్లాండ్ త్వరలో నాటో కూటమిలో చేరేందుకు వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు సౌలి నిన్నిస్టో, ప్రధాని సన్నామారిన్‌లు ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేయడం కలకలం రేపుతోంది. వెంటనే నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయడానికి సిద్ధం కావాలని వారిద్దరూ పిలుపునిచ్చారు. రానున్న మరికొన్నిరోజుల్లో నిర్ణయం వెలువడుతుందని వెల్లడించారు. నాటో సభ్యత్వంతో ఫిన్లాండ్ భద్రత మరింత బలపడుతుందని…
భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేందుకు ఇటీవల డీఆర్డీఓ, సైన్యం వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్, పినాక వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది. ‘బ్రహ్మోస్’ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఎస్‌యూ -30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని…
ఉక్రెయిన్‌పై రష్యా… 70 రోజులకుపైగా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది. సైనిక చర్య పేరుతో దండయాత్ర మొదలుపెట్టిన క్రెమ్లిన్… ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతోంది. క్షిపణుల వర్షం కురిపిస్తుండటంతో… భవనాలు నేలమట్టమవుతున్నాయి. వాటి కింద ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఉక్రెయిన్ ప్రధాన నగరాల్లో ఒకటైన ఖర్కివ్‌లో రెండు నెలల క్రితం రష్యా ఓ భవనంపై బాంబులు వేసింది. శిథిలాల తొలగిస్తున్న ఉక్రెయిన్ సైన్యం…44 మృతదేహాలను ఆలస్యంగా గుర్తించింది. Read Also: Mahmood Ali : 3 నెలల్లో…
ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ ప్రారంభమై రెండు నెలలు దాటింది. అయినా ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. బలమైన సైన్యం కలిగిన రష్యా ముందు ఉక్రెయిన్ కేవలం కొన్ని రోజుల్లోనే లొంగిపోతుందని అంతా భావించినప్పటికీ… అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇస్తున్న ఆయుధ, సైనిక సహకారంతో రష్యాకు ఎదురొడ్డి నిలుస్తోంది. రష్యన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బెలారస్, టర్కీ వేదికగా ఇరుదేశాలు పలుమార్లు చర్చలు జరిపినా ఉద్రిక్తతలు తగ్గడం…