రష్యా – ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అందరి దృష్టి రష్యా అధ్యక్షుడు పుతిన్ పై పడింది. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని వివిధ కథనాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపైనా రకరకలా ఊహగానాలు వెలువడుతుండడంతో అందరూ ఆయనకు ఏమైందో తెలుసుకోవాలనుకుంటున్నారు. పుతిన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని.. ఎక్కువ రోజులు బతికి ఉండలేరని ఇప్పటికే వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. వ్లాదిమిర్ పుతిన్…
ఉక్రెయిన్ తో యుద్ధం కారణంగా రష్యా అనేక ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా చమురు, గ్యాస్ కొనుగోలుపై పలు పాశ్చాత్య దేశాలు నిషేధాన్ని విధిస్తున్నాయి. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే అనేక మల్టీ నేషనల్ కంపెనీలు రష్యా నుంచి వైదొలుగుతున్నాయి. ఎన్ని ఆంక్షలు విధించినా ఉక్రెయిన్ పై దాడిని ఆపడం లేదు రష్యా. ఇదిలా ఉంటే భారత్ కు అతి తక్కువ రేటుకే రష్య చమురును ఆఫర్ చేసింది. దీంతో ఇండియా…
జూన్ చివరి నాటికి రష్యా 40వేల మందికి పైగా సైనికులను కోల్పోయే అవకాశం ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ జెలెన్స్కీ అన్నారు. “రష్యన్ సైన్యం డాన్‌బాస్‌లో రిజర్వ్ దళాలను మోహరించడానికి ప్రయత్నిస్తోందని.. అయినా వారు ఏం సాధించారని” ఆదివారం ఆయన వ్యాఖ్యానించారు. జూన్‌లో రష్యా 40వేలకు పైగా సైనికులను కోల్పోవచ్చని.. వారు అనేక దశాబ్దాలుగా చేసిన ఏ యుద్ధంలోనూ అంతమంది సైనికులను కోల్పోయి ఉండదని జెలెన్స్కీ వివరించారు. ఎనిమిదేండ్లుగా రష్యా అనుకూల రెబెల్స్ ఆధీనంలో ఉన్న…
ఉక్రెయిన్‌పై రష్యా కొనసాగిస్తున్న దండయాత్రకు అంతర్జాతీయంగా ఖండన ఉన్నప్పటికీ, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదివారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు పూర్తి మద్దతును ప్రకటించారు. “రష్యా ప్రజలు అన్ని రకాల సవాళ్లు, కష్టాలను ఎదుర్కొంటూ తమ దేశం యొక్క గౌరవం, భద్రతను కాపాడుకోవడంలో గొప్ప విజయాలు సాధించారు” అని కిమ్ ఓ సందేశంలో పేర్కొన్నట్లు ప్యాంగ్యాంగ్ అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా దినోత్సవం సందర్భంగా పుతిన్‌కు కిమ్ మద్దతు…
భారత్‌కు ఎస్-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థలను ముందుగా నిర్ణయించుకున్న గడువు ప్రకారమే అందజేయనున్నట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ‘ఎస్-400’ సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుందేమోనని భారత్‌లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మన దేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా-భారత దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా భారతదేశంలో రష్యా రాయబారి డేనిస్ అలిపోవ్ మాట్లాడుతూ.. S-400 ట్రయంఫ్ గగనతల క్షిపణి రక్షణ వ్యవస్థ నిర్ణయించుకున్న…
ఉక్రెయిన్‌లో పారిశ్రామిక ప్రాంతమైన డాన్‌బాస్‌ను పూర్తిగా ఆక్రమించుకోవాలనే లక్ష్యానికి రష్యా దాదాపుగా చేరువైంది. అక్కడ కీలక నగరమైన సీవీరోదొనెట్స్క్‌లో ఓ రసాయన కర్మాగారంపై రష్యన్ బలగాలు భీకర దాడులు జరిపాయి. అక్కడ ఉన్న అజోట్ రసాయన కర్మాగారంపై రష్యా భారీగా ఫిరంగి గుళ్ల వర్షం కురిపించాయి. దీంతో పెద్ద ఎత్తున చమురు లీకై మంటలు ఎగిసిపడ్డాయి. ఈ కర్మాగారంలో వందల మంది ప్రజలు తలదాచుకున్నట్లు ఉక్రెయిన్ టీవీ పేర్కొంది. బాంబుల నుంచి రక్షణ కోసం ఫ్యాక్టరీ ఆవరణలోని…
ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్.. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను నిరసిస్తూ రష్యాలో తమ సంస్థ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పుడు మూతబడ్డ ప్రఖ్యాత ఫాస్ట్‌ఫుడ్ చెయిన్ మెక్‌డొనాల్డ్స్ రెణ్నెల్ల తర్వాత మళ్లీ తెరుచుకుంది. రష్యాలో మెక్‌డొనాల్డ్స్ యాజమాన్య హక్కులను స్థానిక వ్యాపారవేత్త అలెగ్జాండర్ గోవర్ కొనుగోలు చేశారు. తాజాగా ఆదివారం మాస్కోలో సరికొత్త పేరుతో మెక్‌డొనాల్డ్స్‌ను పునఃప్రారంభించారు. దిగ్గజ ఫాస్ట్‌పుడ్ సంస్థ మెక్‌డొనాల్డ్.. రష్యాలో తన కార్యకలాపాలను కొత్త పేరుతో ఆదివారం ప్రారంభించింది.…
భారత్, చైనాతోనే కాకుండా లాటిన్ అమెరికా, ఆఫ్రికా దేశాలతోనూ సన్నిహత సంబంధాలు కొనసాగించే అవకాశాలు తమకు ఉన్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ప్రపంచదేశాలతో రష్యాను ఒంటరిని చేయడం అసాధ్యమని పరోక్షంగా తేల్చిచెప్పారు. రష్యాపై పశ్చిమ దేశాలు ఆంక్షలు పెంచుతున్న నేపథ్యంలో ఆయన ఈ విధం వ్యాఖ్యలు చేశారు. ఆఫ్రికా నిద్రాణ స్థితిలో ఉన్నా ఎప్పటికైనా మేల్కొంటుందని… అక్కడ 150 కోట్ల మంది ఉన్నారన్నారు. రష్యా చుట్టూ బయటి నుంచి కంచె వేయడం అసాధ్యమని పుతిన్…
తూర్పు ఉక్రెయిన్‌లోని పారిశ్రామిక ప్రాంతం డాన్‌బాస్‌లో ఒక భాగమైన సీవిరోడోంటెస్క్‌ను పూర్తిస్థాయిలో చేజిక్కించుకునేందుకు రష్యా దళాలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్–రష్యా సైనికుల మధ్య వీధి పోరాటాలు జరుగుతున్నాయి. ప్రత్యర్థులతో తమ సైనికులు వీరోచితంగా తలపడుతున్నారని లుహాన్స్క్ గవర్నర్ సెర్నీ హైదాయ్ గురువారం ప్రకటించారు. గనులు, పరిశ్రమలు, సముద్రతీరంతో సుసంపన్నమైన డాన్‌బాస్‌ను హస్తగతం చేసుకునేందుకు తహతహలాడుతున్న రష్యా… ఆ ప్రాంతంలోని పలు నగరాల్లో దాడుల తీవ్రతను పెంచింది. నెలల తరబడి జరుగుతున్న యుద్ధంలో పలు పట్టణాలపై పట్టు చేజార్చుకున్న…
దేశంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉన్న నేపథ్యంలో ధరల తగ్గింపునకు సంబంధించి అన్ని అవకాశాలను కేంద్రం వినియోగించుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులను రెట్టింపు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. దీనికోసం ప్రభుత్వ రంగ చమురు సంస్థలతో చర్చలు జరుపుతోంది. రానున్న ఆరు నెలల పాటు ముడి చమురు సరఫరా కోసం ఒప్పందం చేసుకునేందుకు దేశీయ చమురు సంస్థలు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి.…