Vladimir Putin: అలా చేస్తే ప్రతీకారం తప్పదు..ఫిన్లాండ్, స్వీడన్లకు వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వీడన్, ఫిన్లాండ్ నాటో కూటమిలో చేరబోతున్నాయి. అందుకు ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే ఈ విషయంపై మొదటి నుంచి రష్యా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గతంలో రష్యా ఈ విషయమై స్వీడన్, ఫిన్లాండ్లకు వార్నింగ్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ రెండు దేశాలు నాటో కూటమిలో చేరడంపై రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. తర్కమెనిస్థాన్ రాజధాని అష్గాబాత్ లో జరిగిన ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉక్రెయిన్ మాదిరిగా రష్యాకు స్వీడన్, ఫిన్లాండ్ తో ఎలాంటి సమస్యలు లేవని ఆయన అన్నారు. ఈ రెండు దేశాలతో ప్రాదేశిక వివాదాలు లేవని పుతిన్ అన్నారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరడంపై రష్యాకు అభ్యంతరం లేదని. వారు కోరుకుంటే చేరవచ్చని.. అది వారి ఇష్టమని అన్నారు.
Also Read
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
- Nepal Floods: వరదలకు మీరే కారణం.. భారత్, చైనా, అమెరికాలను టార్గెట్ చేస్తున్న నేపాల్..
అయితే స్వీడన్, ఫిన్లాండ్ దేశాల ఓ హెచ్చరిక జారీ చేశారు పుతిన్. సైనిక మౌళిక సదుపాయాలను ఈ దేశాల్లో మోహరించినట్లయితే ఖచ్చితంగా రష్యా నుంచి ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. మాకు బెదిరింపులు తలెత్తితే పర్యవసనాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.
ఫిబ్రవరి 24న నాటో, వెస్ట్రన్ అనుకూల ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. దీంతో స్వీడన్, ఫిన్లాండ్ రెండూ నాటోలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. బుధవారం మాడ్రిడ్ లో జరిగిన నాటో సదస్సులో సభ్యత్వం కోసం అధికారిక ప్రక్రియ ప్రారంభం అయింది. అయితే గతంలో ఈ రెండు దేశాలు నాటో చేరడాన్ని అంతర్జాతీయ భద్రతను అస్థిర పరిచే అంశంగా రష్యా పేర్కొంది. నాటో సామ్రాజ్య ఆశయాలను పుతిన్ ఖండిచారు. ఉక్రెయిన్ దేశాన్ని వాడుకుని నాటో కూటమి తమ ఆధిపత్యాన్ని చూపించాలనుకుంటుందని విమర్శించారు.
తాజావార్తలు
-
Polavaram Rehabilitation: తాడువాయిలోనే ఇళ్లు కావాలి.. పోలవరం నిర్వాసితుల భారీ ధర్నా!
-
Rana Daggubati: ఇక హీరోల హవా తగ్గినట్టేనా? డైరెక్టర్ల బ్రాండ్‌పై రానా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
-
BJPలో చేరిన రాఘవ్ చడ్డాకు ఓటర్ లిస్ట్ షాక్.. పంజాబ్ ఓటర్ లిస్ట్‌లో పేరు మాయం!
-
Imam ul Haq Ban: గాయం అంటూ నాటకాలు.. పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్‌పై రెండేళ్ల నిషేధం!
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!