ఉత్సాహం ఉండాలి, కానీ అత్యుత్సాహం ఉండకూడదు. ఏం కాదులే అని ఆ అత్యుత్సాహాన్ని ఎక్కడిపడితే అక్కడ ప్రదర్శిస్తే మాత్రం.. బాక్స్ బద్దలవ్వడం ఖాయం! ఇప్పుడు నెదర్లాండ్స్ రాయబారి కారెల్ వాన్ ఓస్టెరోయ్ విషయంలోనూ అదే జరిగింది. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో భారతదేశానికి సలహా ఇవ్వబోయి, గట్టి ఎదురుదెబ్బని ఎదుర్కొన్నాయన! దీంతో, మరో దారి లేక ఆయన వెంటనే వెనకడుగు వేయాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే.. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తోన్న యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, సాధారణ…
ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆక్రమణను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.. మే 9వ తేదీలోగా ఉక్రెయిన్‌పై అధికారికంగా పుతిన్ యుద్ధం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఈ చర్యలో భాగంగా రష్యా తన పూర్తి సైన్యాన్ని ఉక్రెయిన్ భూభాగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. మే 9వ తేదీన విక్టరీ డేను రష్యా జరుపుకుంటోంది. 1945లో ఆ రోజున నాజీలను రష్యా ఓడించింది. ఆ రోజున ఉక్రెయిన్‌లో సాధించిన సైనిక…
తెలంగాణ ప్రజల కోసం నేను ప్రాణం అయినా ఇస్తానన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. బంగారు తెలంగాణ అయిందా? వెండి తెలంగాణ అయినా అయిందా? అప్పుల తెలంగాణ అయింది. అప్పులు ఎందుకు అయిపోయాయి? నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరని పాల్ ప్రశ్నించారు. 8 ఏళ్ళ వరకూ నిరుద్యోగులు గుర్తుకురాలేదా? నాకు సెక్యూరిటీ అడిగినా ఇవ్వలేదు. నేను రాకుంటే ఇంకా దోచుకుంటారా? ఇంకా తెలంగాణను అమ్మేస్తారా? మీకోసం నేను వచ్చా. ఒక్కొక్కరు వందమంది వెయ్యిమందికి చెప్పండి. అన్నివర్గాల…
ఉక్రెయిన్-రష్యా యుద్ధం రోజురోజుకు తీవ్రం అవుతుందే కానీ తగ్గుతున్న సూచనలు కనిపించుట లేదు. యుద్ధం మొదలై రెండు నెలలు దాటింది. శాంతి సాధన దిశగా అడుగు కూడా ముందుకు పడే సూచనలు లేవు. పైగా రష్యా పదే పదే అణు జపం చేస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం తప్పదన్నట్టుగా మాట్లాడుతోంది. ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాలు ఆయుధ సాయం ఇలాగే కొనసాగితే పుతిన్ ఏం చేస్తాడో ఊహించను కూడా ఊహించలేం. ఇప్పుడు జరుగుతోంది పేరుకే ఉక్రెయిన్- రష్యా యుద్ధం.…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మరింత ఉధృతంగా మారుతోంది. అమెరికా సహా నాటో కూటమి దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తుండటంతో రష్యా సర్కారు మరింత భీకరంగా విరుచుకుపడుతోంది. నాటో దేశాలు తమను కవ్విస్తున్నాయని, ఇందుకు భారీ మూల్యం చెల్లించుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోస్ హెచ్చరించారు. ఉక్రెయిన్ ఇలాగే మొండిగా వ్యవహరిస్తే మూడో ప్రపంచ యుద్ధం, అణ్వాయుధాల ప్రయోగం తప్పదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ఉక్రెయిన్‌తో శాంతి ఒప్పందంపై తాము ఇప్పటికీ ఆశాభావంతో…
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. ఉక్రెయిన్ బలగాల నుంచి ప్రతిఘటన ఎదురవుతున్నా.. కీలక నగరాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదులుతోంది రష్యా సైన్యం.. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ మధ్య పలు దపాలుగా జరిగిన శాంతి చర్చలు విఫలం అయిన విషయం తెలిసిందే కాగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ రంగంలోకి దిగారు.. ఈ నెలలోనే రెండు దేశాల్లో పర్యటించబోతున్నారు. Read Also: Summer Holidays: ఏపీ…
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సిటీలు, పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా యుద్ధం కొనసాగిస్తోంది రష్యా.. వరుగా సిటీలను స్వాధీనం తీసుకుంటూ ముందుకు సాగుతోంది.. ఇక, ఉక్రెయిన్ కీలక నగరాల్లో ఒకటైన మేరియుపోల్ తమ వశమైయిందని తాజాగా ప్రకటించారు రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఆ దేశా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుతో జరిగిన సమావేశంలో పుతిన్ మాట్లాడుతూ.. మేరియుపోల్ విమోచన కోసం చేపట్టిన సైనిక చర్య విజయవంతం కావడం గొప్ప విజయంగా అభివర్ణించారు.. మిమ్మల్నందరినీ…
టెన్నిస్ స్టార్ ప్లేయర్ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త అందించింది. మంగళవారం నాడు ఆమె 35వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు స్వయంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు బీచ్‌లో నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. షరపోవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె గుడ్ న్యూస్ చెప్పిన మరుక్షణమే ఈ వార్త వైరల్‌గా…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఆయుధాలు వీడాలంటూ ఎన్ని అల్టీమేటంలు జారీ చేసినా తమ దారికి వచ్చేందుకు ఉక్రెయిన్ సైన్యం ససేమిరా అంటుండటంతో ఆగ్రహించిన రష్యా.. మంగళవారం నాడు ఉక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడింది. రష్యాకు ఆనుకుని ఉన్న ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలు, మరికొన్ని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించింది. 24 గంటల వ్యవధిలో దాదాపుగా వెయ్యి ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. తమ మధ్య యుద్ధంలో కొత్త దశ…
అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు ఎదురైనా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తూనే ఉంది.. ఇరు దేశాల మధ్య యుద్ధం 48వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్‌లో పలు ప్రాంతాలపై ఇంకా రష్యా సేనలు దాడులు చేస్తున్నాయి. బాంబులు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం రష్యా తన దాడులను కీవ్ నుంచి తూర్పు ఉక్రెయిన్ వైపు కేంద్రీకృతం చేసింది. పోర్టు సిటీ మరియుపోల్ పై నియంత్రణ సాధించే లక్ష్యంతో రష్యన్ దళాలు ముందుకు సాగుతున్నాయి. కాగా వారిని అడ్డుకునేందుకు, తమ భూభాగాన్ని…