Putin: రష్యా అధ్యక్షుడి కీలక నిర్ణయం.. ఉక్రెయిన్ పౌరులకు రష్యా పౌరసత్వం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పౌరులకు వేగంగా రష్యా పౌరసత్వం పొందేలా వీలు కల్పించే ఉత్తర్వులపై సోమవారం సంతకం చేశారు. తద్వారా ఉక్రెయిన్‌పై మాస్కో ప్రభావాన్ని మరింత విస్తరించే ప్రయత్నం మొదలైనట్లయింది. ఇప్పటికే తూర్పు ఉక్రెయిన్ దిశగా దాడులకు దిగుతున్న రష్యా దాదాపు చాలా ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. రష్యా అనుకూల వేర్పాటువాదుల ప్రాబల్యమున్న డాన్‌బాస్ ప్రాంతంలోని లుహాన్స్క్ ప్రావిన్స్‌పై మాస్కో సేనలు పట్టు సాధించాయి. ఇటీవలి కాలం వరకు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజ్జియా, ఖేర్సన్ వంటి ప్రాంతాల నుంచి వచ్చినవారికే సులభతర విధానంలో రష్యా పౌరసత్వం లభించేది. దాదాపు ఇవన్నీ రష్యా నియంత్రణలోనే ఉండేవి. తాజాగా ఉక్రెయిన్ మొత్తానికి ఈ విధానాన్ని వర్తింపజేయాలని పుతిన్ నిర్ణయించారు.
వెకేషన్ లో స్టార్ కపుల్ రొమాంటిక్ పోజులు..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
దీనిపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. 2019లో ఈ విధానాన్ని రెండు ప్రాంతాల వారి కోసం ప్రారంభించగా ఈ ఏడాది మే నెలలో మరో రెండు ప్రాంతాలను చేర్చారు. మొత్తంమీద ఇప్పటివరకు దాదాపు 7.20 లక్షల మందికి రష్యా పాస్‌పోర్టులు కూడా జారీ అయ్యాయి. ఉక్రెయిన్ జనాభాలో 18 శాతం మంది వీటిని పొందారు.ఇప్పటికే ఉక్రెయిన్ రెండు ప్రాంతాల్లో నివసించే వారితి పౌరసత్వాన్ని వేగవంతం చేశారు. అంతేకాదు దాదాపు రష్యన్ దళాల నియంత్రణలో ఉన్న ఖేర్సన్, జపోరిజ్జియా వంటి ఆగ్నేయా ప్రాంతాల్లో ఈ విధానాన్ని వేగవంతం చేశారు. ఇలానే 2019లో తూర్పు ఉక్రెయిన్ నుంచి విడిపోయిన మాస్కో అనుకూల వేర్పాటువాద ప్రాంతాలైన డొనెట్స్క్, లుగాన్క్స్ వంటి ప్రాంతాల్లోని నివాసితులకు ఇలాంటి డిక్రీని ఆదేశించి తనలోకి కలిపేసుకుంది. వాస్తవానికి ఈ డిక్రీ ద్వారా సరళీకృత విధానంలో రష్యా పౌరసత్వాన్ని పోందేలా దరఖాస్తు చేసుకునే హక్కుని ఉక్రెయిన్ పౌరులకు రష్యా అందిస్తోంది. ఈ డిక్రీతో పౌరసత్వం పొందిన వారు రష్యాలో భాగమవుతారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!