Finland joins NATO military alliance: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(నాటో) సైనిక కూటమిలో ఫిన్లాండ్ సభ్యదేశంగా చేరింది. అమెరికా నేతృత్వంలోని ఈ కూటమిలో 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేసింది. మరో స్కాండనేవియన్ దేశం స్వీడన్ ఈ కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో రక్షణ కోసం ఈ రెండు దేశాలు నాటోలో చేరేందుకు మొగ్గు చూపాయి. తాజాగా ఫిన్లాండ్ దేశం కూటమితో సభ్య దేశంగా చేరింది. దీంతో నాటో ఆధిపత్యం రష్యాకు…
China: రష్యా తన మిత్రదేశాలు, దానికి సంబంధించిన విదేశాంగ విధానంపై ఇటీవల ప్రకటన జారీ చేసింది, తన మిత్ర దేశాలైన చైనా, భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్తగా ఫారిన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తన మిత్రదేశాల ఏవో, శతృదేశాలేవనే దాని గురించి చెప్పకనే చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను శతృవుగా చూస్తుండటంతో కొత్త విదేశాంగ విధానం ద్వారా రష్యా మరింత బలోపేతం…
రష్యా తూర్పు తీరంలో సోమవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీ సంభవించలేదని, తక్షణ ప్రాణనష్టం లేదా విధ్వంసం లేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నూతన విదేశాంగ విధాన సిద్ధాంతాన్ని శుక్రవారం ఆమోదించారు. ఆ విధానం ప్రకారం రష్యా యురేషియాలో భారతదేశంతో తన వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
Russia Announces Deal To Boost Oil Supplies To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలును నిలిపివేశాయి. అయితే రష్యా తన మిత్రదేశాలు అయిన ఇండియా, చైనాకు క్రూడ్ ఆయిల్ ను అత్యంత చౌకగా అందిస్తోంది. అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు భారత్ పై ఒత్తిడి చేస్తున్నా మోదీ ప్రభుత్వం దృఢంగా వ్యవహరిస్తోంది. మా ప్రజలు అవసరాలకు అనుగుణంగా ఎక్కడ తక్కువ ధరకు చమురు దొరికితే అక్కడ…
Russia Says Oil Sales To India: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేసి, రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీద్దాం అనుకున్న అమెరికా, యూరోపియన్ దేశాలకు ప్లాన్ బెడిసికొట్టింది. భారత్, చైనా రూపంలో బలమైన మార్కెట్లను రష్యా ఆదాయంగా మలుచుకుంది. ఈ రెండు దేశాలకు కావాల్సిన చమురును అత్యంత చౌకగా రష్యా అందిస్తోంది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రష్యా నుంచి భారత్ కు క్రూడ్ ఆయిల్ దిగుమతులు పెరిగాయి.
Indo-Russian mega meet: ఇండియా, రష్యా దేశాల మెగా బిజినెస్ మీటింగ్ ఈ నెల 29, 30 తేదీల్లో జరగనుంది. సెయింట్ పీటర్స్బర్గ్లో నిర్వహించే ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరంలో భాగంగా దీన్ని ఏర్పాటుచేశారు. "అభివృద్ధి మరియు పెరుగుదల కోసం వ్యూహాత్మక భాగస్వామ్యం" అనే కాన్సెప్ట్తో ఈ భేటీ జరగబోతోంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఈ సంవత్సరం 50 బిలియన్ డాలర్లకు చేర్చటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐరోపా దేశాల్లో అమెరికా అణ్వాయుధాలను మోహరించినట్లే బెలారస్లో తాము అణ్వాస్త్రాలను ఉంచే యోచనలో ఉన్నట్లు పుతిన్ పేర్కొన్నారు.
వ్లాదిమిర్ పుతిన్పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) వారెంట్ జారీ చేసిన తర్వాత విదేశాల్లో వ్లాదిమిర్ పుతిన్ను అరెస్టు చేసే ప్రయత్నాలను మాస్కో "యుద్ధ ప్రకటన"గా చూస్తుందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ హెచ్చరించారు.
Russia: రష్యా-ఉక్రెయిన్ యద్ధాన్ని విమర్శించి పాప్ స్టార్ డిమానోవా(35) ఓ నది ప్రమాదంలో మరణించినట్లు న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. ఆయన అసలు పేరు డిమిత్రి స్వర్గునోవ్. ఆయన ప్రముఖ సంస్థ క్రీమ్ సోడా వ్యవస్థాపకుడు. డీమానోవా తన సోదరుడు ముగ్గరు స్నేహితులతో కలిసి మార్చి 19న గడ్డకట్టిన వోల్గా నది దాటుతుండగా మంచులో పడిపోయి మరణించారు. అతడి ఇద్దరు స్నేహితులను రక్షించగా.. మూడో వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు.