Vladimir Putin: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతన్ ఆరోగ్యంపై వదంతులు వస్తూనే ఉన్నాయి. పుతిన్ ఆరోగ్యం చాలా క్షీణించందని, ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, క్యాన్సర్ తో ఇబ్బందిపడుతున్నారని పలు వార్తలు వచ్చాయి. తాజాగా వచ్చిన ఓ నివేదిక పుతిన్ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని తెలిపింది. అతడి ఆరోగ్యంపై వైద్యులు భయాందోళనలో ఉన్నట్లు తెలిపింది.
పుతిన్ ఆరోగ్యం మరింతగా దిగజారిందని తీవ్రమైన తలనొప్ప, అస్పష్టపు కంటి చూపు, నాలుక తిమ్మిరితో బాధపడుతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రామ్ ఛానెల్ తెలిపింది. పుతిన్ తన కుడి చేయి మరియు కాలులో పాక్షికంగా మొద్దుబారినట్లు నివేదించింది. తక్షణ వైద్య సహాయం అవసరం అని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం పుతిన్ కు చికిత్స చేసినట్లు, మందులు వాడాలని, చాలా రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆదేశించినట్లు నివేదిక పేర్కొంది.
Read Also: Balagam Mogilaiah: ‘బలగం’ సినిమాలో క్లైమాక్స్ పాట పాడి ఏడిపించిన మొగిలయ్య కి తీవ్ర అస్వస్థత
అయితే రష్యా అధినేత మాత్రం విశ్రాంతి తీసుకునేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడికి సంబంధించిన నివేదికలతో బిజీగా ఉన్నట్లు రిపోర్టు తెలిపింది. పుతిన్ బంధువులు ఆందోళన చెందారని, అధ్యక్షుడి ఆరోగ్యం తాత్కాలికంగా క్షీణించడం ఆయన సన్నిహితులు టెన్షన్ పెడుతుందని, ఒక వేళ పుతిన్ ఆకస్మికంగా మరణిస్తే వీరిందరిని అజ్ఞాతంలో ఉంచుతుందని జనరల్ ఎస్వీఆర్ నివేదించింది. అంతకుముందు కూడా ఫిబ్రవరి 2023లో బెలారస్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ లుకాషెంకోతో సమావేశం సమయంలో పుతిన్ తన పాదాలను నియంత్రించుకోలేకపోయాడని పలు వీడియోలు వెలుగులోకి వచ్చాయి.
స్పానిష్ వార్తా సంస్థ మార్కా ప్రకారం, రష్యా అధ్యక్షుడు క్యాన్సర్ మరియు పార్కిన్సన్స్ వ్యాధితో పోరాడుతున్నారని పేర్కొంది. పుతిన్ పార్కిన్సన్స్ ప్రారంభ దశలో ఉన్నారని తెలిపింది. అయితే క్రెమ్లిన్ వర్గాలు మాత్రం పుతిన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని చెబుతోంది. అయినప్పటికీ పలు సంస్థలు మాత్రం ఆయన ఆరోగ్యంపై ఎప్పటికప్పడు వార్తల్ని ప్రచురిస్తూనే ఉన్నాయి.