ఈ రోజు మీరు మీ జీవితంలో ఎంత సంతృప్తిగా లేదా సంతోషంగా ఉన్నారు? ఉక్రెయిన్, రష్యా, పాకిస్థాన్, ఇరాక్, శ్రీలంక వంటి యుద్ధం లేదా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లోని ప్రజల కంటే భారతీయులు సంతోషంగా లేరని వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023 వెల్లడించింది.
Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులు ఐఫోన్లు వాడొద్దనే ఆదేశాలు అధికారులకు వెళ్లాయి. అధ్యక్ష భవనం క్రెమ్లిన్ నుంచి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. అమెరికా తయారీ ఐఫోన్ కావడంతో పాశ్చాత్య దేశాలు నిఘా పెంచే అవకాశం ఉండటంతో క్రెమ్లిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తవి కొనొద్దని, ఉన్నవాటిని పక్కన పారేయాలని అధికారులను ఆదేశించారు.
Putin Visits Mariupol: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆక్రమిత ఉక్రెయిన్ లో ఆకస్మికంగా పర్యటించారు. మారియోపోల్ నగరాన్ని సందర్శించారు. యుద్దం ప్రారంభం అయిన తర్వాత ఈ నగరాన్ని రష్య ఆక్రమించింది. తాజాగా మొదటిసారిగా పుతిన్ ఈ నగరాన్ని సందర్శించారు. వేలాది మంది ఉక్రెయిన్ పిల్లలపై రష్యా అకృత్యాలకు పాల్పడిందని ఇంటర్నెషనల్ క్రిమినల్ కోర్టు పుతిన్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత ఈ పర్యటన జరిగింది.
అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను రష్యా కూల్చివేసింది. నల్ల సముద్రం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తమ మిలిటరీకి చెందిన ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఉక్రెయిన్కు అమెరికా చేరవేస్తున్నట్లు రష్యా ఆరోపిస్తోంది.
Donald Trump: అమెరికాలో వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ నేత డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసేందుకు సిద్ధం అయ్యారు. ఇప్పటికే రిపబ్లిక్ పార్టీ నుంచి ఆయన జూనియర్ నిక్కీ హేలి ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ర్యాలీలో కీలక వ్యాఖ్యలు చేశారు. మూడో ప్రపంచ యుద్దం ఆపేసత్తా నాకే ఉందని ఆయన అన్నారు. అధ్యక్షుడు జో బైడెన్ రష్యాను చైనా చేతుల్లో పెట్టారని విమర్శించారు.
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో కొందరు రష్యా సైనికులు చేసిన అకృత్యాలు, అఘాయిత్యాలు బయటకు వస్తున్నాయి. గతేడాది ఇద్దరు రష్యన్ సైనికులు నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారని, చిన్నారి తల్లికి తుపాకీ గురిపెట్టి, భర్త ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఉక్రెయిన్ ఆరోపించింది. ఉక్రెయిన్ ప్రాసిక్యూషన్ ఫైల్స్ ప్రకారం 2022 మార్చినెలలో రాజధాని కీవ్ కు సమీపంలో బ్రోవరీ జిల్లాల్లో 4 ఇళ్లల్లోకి చొరబడి రష్యా 15వ స్పెషల్ మోటరైజ్డ్ రైఫిల్ బ్రిగేడ్ కు చెందిన…
Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది. బఖ్ ముత్ పట్టణంపై ఆధిపత్యం కోసం రష్యా తీవ్రదాడులు చేస్తోంది. ఒకవేళ ఈ పట్టణం రష్యా వశం అయితే ఇక ఉక్రెయిన్ కు లొంగిపోవడమే దిక్కు. రష్యన్ బలగాలు సునాయసంగా తూర్పు ప్రాంతాలపై ఆధిపత్యం కనబడిచే అవకాశం ఉంది. దీంతోనే బక్ ముఖ్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు రష్యాను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు పోరుగుతున్నాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ దూసుకెళ్తోంది. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (SIPRI) తాజా నివేదిక ప్రకారం.. 2013-17 మరియు 2018-22 మధ్య ఆయుధాల దిగుమతిలో 11 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, భారతదేశం 2018 నుండి 2022 వరకు ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా మొదటి స్థానంలో ఉండగా.. సౌదీ అరేబియా తర్వాతి స్థానంలో ఉంది.