Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా మరోసారి విరుచుకుపడింది. బుధవారం ఉక్రెయిన్ లోని దక్షిణ ఖేర్సన్ ప్రాంతంపై రష్యా క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఘటనలో 21 మంది మరణించడంతో పాటు 48 మంది గాయపడ్డారు. శుక్రవారం నుండి ప్రధాన నగరమైన ఖెర్సన్‌లో అధికారులు కర్ఫ్యూ విధించారు.
Russia: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను అంతమొందించడానికి మాస్కోలోని అధ్యక్ష భవనంపై డ్రోన్ అటాక్ ప్రపంచాన్ని కలవరపరిచింది. ఈ ఘటనకు ఉక్రెయిన్ కారణం అని, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ పథకం ప్రకారమే పుతిన్ ను అంతమొందించడానికి ప్రయత్నించాడని రష్యా పార్లమెంట్ ఆరోపించింది. తమకు ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉందని రష్యా తీవ్ర స్వరంతో హెచ్చరించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. క్రెమ్లిన్ డ్రోన్ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఉక్రెయిన్ బుధవారం ప్రకటించింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హత్య ఉక్రెయిన్ ప్రయత్నాలు చేస్తోందని రష్యా సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ రాత్రిపూట రెండు డ్రోన్లతో క్రెమ్లిన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించిందని రష్యా అధికారులు బుధవారం ఆరోపించారు
ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ హత్యకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యా నేడు ఆరోపించింది. ఆరోపించిన దాడికి ఉపయోగించిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు పేర్కొంది.
Ukraine 'Maa Kali' tweet: ఉక్రెయిన్ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘‘కాళీ మాత’’ అగౌరపరిచేలా వివాదాస్పద ట్వీట్ చేసింది. దీనిపై భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ట్వీట్ చేసింది. రష్యాలో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత ఓ వెలువడిన పోగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రోను గుర్తు తెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’అనే క్యాప్షన్ తో…
Zelensky: ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించి ఈ ఏడాది ఫిబ్రవరికి సంవత్సరం గడిచింది. అయితే ఈ రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్దం ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే క్రిమియాను కోల్పోయిన ఉక్రెయిన్, ఖేర్సర్, లూహాన్స్క్, డోనెట్స్క్, జపొరిజ్జియా ప్రాంతాలను కూడా కోల్పోయింది.
India becomes Europe's largest supplier of refined fuels: యూరప్ దేశాలకు అతిపెద్ద రిఫైన్డ్ ఇంధన సరఫరాదారుగా భారత్ నిలిచింది. భారత్ నుంచి గణనీయంగా శుద్ధి చేసిన ఇంధనం యూరప్ కు ఎగుమతి అవుతోంది. ఈ నెలలో రికార్డ్ స్థాయికి ఇంధన ఎగుమతులు చేరాయి. అనలిటిక్స్ సంస్థ Kpler వెల్లడించిన డేటా ప్రకారం ఈ విషయం వెల్లడైంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో భారత్ నుంచి యూరప్ కు ఇంధన ఎగుమతులు పెరిగాయి. రోజుకు 3,60,000 బ్యారెళ్ల…
రష్యా దాడులు శుక్రవారం ఉక్రెయిన్ అంతటా నగరాలను దెబ్బతీశాయి. ఉక్రెయిన్‌పై శుక్రవారం తెల్లవారుజామున రష్యా ప్రయోగించిన క్షిపణి దాడుల్లో ఐదుగురు పిల్లలతో సహా 26 మంది మరణించారు. మాస్కో దళాలపై ఎదురుదాడికి కీవ్ సన్నాహాలు చేస్తున్న తరుణంలో ఈ దాడులు జరిగాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు మరికొన్ని నగరాలపై రష్యా తెల్లవారుజామునే దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో దాదాపు ఐదుగురు వ్యక్తులు మరణించారు. ఉక్రేనియన్ దళాలు త్వరలో దాని పాశ్చాత్య మిత్రదేశాల నుంచి వచ్చిన ట్యాంకులతో సహా కొత్త సైనిక పరికరాలతో దాడిని ప్రారంభించాలని భావిస్తున్నందున రష్యా ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.