Earthquake in Russia: రష్యా తూర్పు తీరంలో సోమవారం 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే సునామీ సంభవించలేదని, తక్షణ ప్రాణనష్టం లేదా విధ్వంసం లేదని రష్యా అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రకారం, భూకంపం రష్యాలోని పసిఫిక్ తీరంలో పెట్రోపావ్లోవ్స్క్-కమ్‌చట్కాకు దక్షిణంగా 44 కిమీ (27 మైళ్ళు) 100 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించింది. మాస్కోకు తూర్పున 6,800 కి.మీ దూరంలో ఉన్న కమ్‌చట్కా ద్వీపకల్పం నుంచి మీడియా పోస్ట్ చేసిన ఫుటేజీలో భూకంపం కారణంగా కూలిన సూపర్ మార్కెట్లు, భవనాలకు పగుళ్లు కనిపించాయి. అయితే పెద్దగా తక్షణ నిర్మాణ నష్టం జరగలేదు.
Read Also: America: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడో.. 21మంది మృతి
“రక్షణ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బందికి చెందిన కార్యాచరణ బృందాలు భవనాలను తనిఖీ చేస్తున్నాయని అత్యవసర మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణనష్టం, విధ్వంసం జరగలేదని తెలిసింది. భూకంప తీవ్రత 6.9గా నమోదైనట్లు రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జియోఫిజికల్ సర్వే కమ్‌చట్కా బ్రాంచ్ తెలిపింది. యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తొలుత భూకంప తీవ్రత 6.6గా ఉందని తెలిపింది. భూకంపం తర్వాత ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని యుఎస్ సునామీ హెచ్చరిక వ్యవస్థ తెలిపింది.