Russia: రష్యాలో మరో ప్రముఖుడిపై దాడి.. ఉక్రెయిన్, అమెరికా పనే అని ఆరోపణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా అధ్యక్షుడిని హతమార్చేందుకు డ్రోన్లను ప్రయోగించిన కొద్ది రోజుల తర్వాత రష్యాలో మరో ప్రముఖుడిపై హత్యాయత్నం జరిగింది. ప్రముఖ రష్యన్ జాతీయవాద రచయిత, జఖర్ ప్రిలేపిన్ ని శనివారం కారుబాంబుతో హతమార్చాలని చూశారు. ఈ ఘటనలో ఆయన గాయపడగా.. కారు నడుపుతున్న డ్రైవర్ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిని అధికారులు అరెస్ట్ చేశారు. ఉక్రెయిన్ తరుపున తాను పనిచేస్తున్నట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు.
మాస్కోకు తూర్పున 400 కి.మీ దూరంలో ఉన్న నిజ్నీ నొవ్‌గోరోడ్ ప్రాంతంలోని ఒక గ్రామంలో ప్రిలెపిన్ కు చెందిన ఆడి క్యూ7 కారు పేల్చివేయబడింది. దీనిని ఉగ్రవాద చర్యగా పరిగణిస్తున్నట్లు రష్యా స్టేట్ ఇన్వెస్టిగేటివ్ కమిటీ తెలిపింది. ప్రిలెపిన్‌ను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. అలెగ్జాండర్ పెర్మియాకోవ్‌గా గుర్తించబడిన అనుమానితుడిని పరిశోధకులు ప్రశ్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజ్నీ నొవ్‌గోరోడ్ రీజియన్ గవర్నర్ గ్లెబ్ నికితిన్ టెలిగ్రామ్‌లో మాట్లాడుతూ ప్రిలెపిన్‌కు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేశారని, ప్రస్తుతం కోలుకుంటున్నాడని వెల్లడించారు.
Also Read
- US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- XI Jinping: ‘‘ AI మనుషుల కంట్రోల్లోనే ఉండాలి’’.. వైట్‌హౌజ్‌లో జిన్‌పింగ్ పిలుపు..
- Saudi Warning: మక్కాకు ప్రమాదం పొంచి ఉంది.. సౌదీ హెచ్చరిక జారీ
Read Also: Maoist: జగిత్యాలలో మావోయుస్టుల వార్నింగ్ లెటర్.. కొత్తగూడెంలో భారీ ఎన్‌కౌంటర్..
ప్రిలేపిన్ టెలిగ్రామ్ ఛానెల్ తో పాటు సొంత వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెళ్లు ఉన్నాయి. 3 లక్షల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆయన రష్యా-ఉక్రెయిన్ యుద్దానికి బలమైన మద్దతుదారుగా ఉన్నారు. యుద్ధానికి మద్దతుగా పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు చేశాడు. ఈ యుద్ధానికి ముందు ఆయన తూర్పు ఉక్రెయిన్ లోని డాన్ బాస్ ప్రాంతంలో రష్యాన్ ప్రాక్సీ దళాల తరుపున పోరాడు. సైనిక విభాగానికి నాయకత్వం వహించాడు.
ఇదిలా ఉంటే ప్రిలేపిన్ పై జరిగిన దాడికి అమెరికా, ఉక్రెయిన్ పనే అని రష్యా ఆరోపించింది. అమెరికా మద్దతుతోనే ఉక్రెయిన్ ఇలాంటి దాడులు చేస్తోందని ఆరోపించింది. మూడు రోజుల క్రితం అధ్యక్ష నివాసంపై పుతిన్ ను చంపేందుకు డ్రోన్ దాడి జరిగింది. దాడి చేయడానికి వచ్చిన డ్రోన్లను రష్యన్ బలగాలు కూల్చేశాయి. ఈ దాడికి కారణం ఉక్రెయిన్ అని రష్యా ఆరోపించింది. రష్యా బదులు తీర్చుకుంటానని హెచ్చరించింది. అయితే రష్యా ఆరోపణల్ని అమెరికా, ఉక్రెయిన్ తోసిపుచ్చాయి.
తాజావార్తలు
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
-
Astrology: సెప్టెంబర్ 25 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!