Putin: ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్యదేశాల వైఖరిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విరుచుకుపడ్డారు. రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యా జరుపుకునే ‘విక్టరీ డే పరేడ్’లో ఆయన ప్రసంగించారు. ప్రపంచం కీలకమైన ‘టర్నింగ్ పాయింట్’ వద్ద ఉందని ఆయన అన్నారు. రష్యా కోసం, మా సాయుధ దళాల కోసం రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో విజయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ కు మద్దతు ఇవ్వడం ద్వారా పాశ్చాత్య దేశాలు పరిస్థితిని తీవ్రస్థాయికి చేర్చాయని పుతిన్ మండిపడ్డారు.
Read Also: The Kerala Story: మంత్రులతో కలిసి సినిమా చూడనున్న సీఎం యోగి.. మరోవైపు బెదిరింపులు
మాస్కోలోని రెడ్ స్వ్కేర్ వద్ద హాజరైన వందలాది మందిని ఉద్దేశిస్తూ మాట్లాడిన ఆయన.. రష్యన్ సైనికుల వెంట దేశం మొత్తం ఉందని అన్నారు. మీ పోరాటాని కన్నా ముఖ్యమైంది మరేది లేదని చెప్పారు. దేశభద్రత, ప్రజల భవిష్యత్తు మీపై ఆధారపడి ఉందని వెల్లడించారు. రష్యాని నాశనం చేయడమే పాశ్చాత్య దేశాల కుట్ర అని, ప్రపంచవ్యాప్తంగా వారు తిరుగుబాట్లను, విభేదాలను ప్రేరేపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని రష్యా తిప్పికొడుతుందని ప్రతిజ్ఞ చేశారు. మేము (తూర్పు ఉక్రెయిన్) డోన్బాస్ ప్రజలను రక్షిస్తాము, మేము మా భద్రత కట్టుబడి ఉన్నామన్నారు.
పశ్చిమ దేశాలు జర్మనీ ‘‘నాజీయిజం’’ వైఖరిని అవలంభిస్తున్నాయని, రెండో ప్రపంచ యుద్ధం ఫలితాలను చెరిపేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ మండిపడ్డారు. మా మాతృభూమిపై యుద్ధం ప్రారంభం అయిందని, దీన్ని మాస్కో తిప్పికొడుతుందని చెప్పారు. ఉక్రెయిన్ సంక్షోభానికి పాశ్చాత్య దేశాలు అహంకారం, ఆశయం లేని విధానం కారణం అని చెప్పారు.