మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండో మ్యాచ్ నేడు ఢాకా వేదికగా జరగనుంది. తొలి వన్డేలో ఒక వికెట్ తేడాతో గెలిపొందిన ఆతిథ్య బంగ్లాదేశ్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. చావో రేవో తేల్చుకోవాల్సిన పోరులో ఎలాగైనా నెగ్గి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని భారత్ కోరుకుంటోంది.
Team India: బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌కు వికెట్ కీపర్ రిషబ్ పంత్ దూరమయ్యాడు. ఇటీవల పంత్ ఫామ్ దృష్ట్యా అతడిని ఈ సిరీస్ నుంచి దూరం చేస్తారని మొదట్నుంచీ డిస్కషన్ నడుస్తూనే ఉంది. అయితే తొలి వన్డేలో పంత్‌ను పక్కనపెట్టడంపై బీసీసీఐ వివరణ ఇచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో పంత్ గాయపడ్డాడని, మెడికల్ టీమ్ సూచనలతో అతన్ని వన్డే సిరీస్ నుంచి తప్పించినట్లు బీసీసీఐ పేర్కొంది. టెస్ట్ సిరీస్‌కు మాత్రం పంత్ అందుబాటులోకి వస్తాడని బీసీసీఐ వివరించింది.…
IND Vs BAN: బంగ్లాదేశ్ పర్యటనలో తొలి పోరుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ ఆదివారం మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా ఈ మ్యాచ్ ద్వారా కుల్దీప్ సేన్‌ను బరిలోకి దించుతోంది. అటు పేలవ ఫామ్‌లో ఉన్న రిషబ్ పంత్‌ను పక్కన పెట్టిన టీమిండియా వికెట్ కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్‌కు అప్పగించింది. Read Also: కుర్రాళ్లకు కేక…
IND Vs BAN: ఇటీవల న్యూజిలాండ్ పర్యటనను ముగించుకుని బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టిన టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. నేటి నుంచి బంగ్లాదేశ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఢాకా వేదికగా ఈరోజు ఉదయం 11:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సీనియర్ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌తో జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఈ సిరీస్‌లో ఆడనున్నారు. దీంతో సీనియర్,…
బంగ్లాదేశ్‌తో డిసెంబర్ 4న ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. న్యూజిలాండ్ టూర్లో విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సీనియర్ త్రయం అంతర్జాతీయ జట్టులోకి తిరిగి వచ్చారు.
Vijay Hazare 2022: విజయ్ హజారే ట్రోఫీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు నారాయణ్ జగదీశన్ రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో ఇప్పటికే వరుసగా నాలుగు సెంచరీలు చేసిన జగదీశన్ తాజాగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో అతడు డబుల్ సెంచరీ సాధించాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్లతో 277 పరుగులు చేయడంతో లిస్ట్ A క్రికెట్లో అత్యధిక పరుగులు…
IPL 2023: ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో దారుణంగా విఫలమైన ముంబై ఇండియన్స్ వచ్చే ఏడాది జరిగే మెగా లీగ్ కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఏకంగా 13 మంది ఆటగాళ్లను ముంబై యాజమాన్యం వదులుకుంది. దీంతో ముంబై పర్స్‌లో రూ.20.5 కోట్లు మిగిలాయి. ఈ డబ్బుతో వచ్చే నెల 20న జరిగే మినీ వేలంలో సత్తా కలిగిన ఆటగాళ్ల కొనుగోలు చేసి వచ్చే సీజన్లో మరోసారి టైటిల్…