Gautham Gambhir: టీమిండియా వన్డే ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్న వేళ టీమ్ కాంబినేషన్‌పై రకరకాలుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కు జోడీగా ఇషాన్ కిషన్‌ను ఆడించాలని సూచించాడు. బంగ్లాదేశ్ పర్యటనలో డబుల్ సెంచరీతో ఇషాన్ కిషన్ రాణించిన విషయాన్ని గంభీర్ గుర్తుచేశాడు. ఇంతకంటే ఇషాన్ కిషన్ సత్తాకు నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించాడు. దీంతో ఓపెనర్ల విషయంలో ఎలాంటి సందేహాలకు తావు ఇవ్వకుండా సెలక్టర్లు…
స్వల్పం విరామం తర్వాత టీమిండియా మళ్లీ బరిలోకి దిగనుంది. జనవరి 3 నుండి ప్రారంభమయ్యే శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు టీమ్ ఇండియా స్క్వాడ్‌ను బీసీసీఐ ప్రకటించింది.
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు న్యూజిలాండ్ పర్యటన నుంచి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌లో రెండో వన్డేలో రోహిత్ గాయపడ్డాడు. స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఎడ్జ్ తీసుకొని తనవైపు వచ్చిన బంతిని పట్టుకునే ప్రయత్నంలో అది రోహిత్ బొటనవేలిని బలంగా తాకింది. ఈ క్రమంలో అతడు క్యాచ్ కూడా జారవిడిచాడు. అప్పటికే బొటన వేలి నుంచి రక్తం కారుతుండటంతో మైదానం వీడాడు. వెంటనే…
Team India: ఈనెల 14 నుంచి బంగ్లాదేశ్‌తో టీమిండియా రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందే భారత జట్టుకు షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దూరమయ్యాడు. ఇప్పటికే షమీ, జడేజా లాంటి ప్రధాన ఆటగాళ్లు కూడా గాయాల కారణంగా ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి టెస్టుకు బీసీసీఐ జట్టులో పలు మార్పులు చేసింది. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ను ఎంపిక చేసింది. అటు…
బంగ్లాదేశ్‌తో రేపు జరిగే మూడో వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను చేర్చినట్లు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ప్రకటించింది. ఆతిథ్య బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 0-2తో కోల్పోయింది. ఆల్ ఇండియా సీనియర్ సెలక్షన్ కమిటీ కుల్దీప్ యాదవ్‌ను చివరి వన్డే కోసం భారత జట్టులో చేర్చింది.