Rohit Sharma: టీమిండియా కెప్టె్న్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. స్వదేశంలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలిచిన హిట్‌మ్యాన్.. ధోనీ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హెన్రీ షిప్లే వేసిన ఐదో ఓవర్లో సిక్స్ కొట్టడం ద్వారా రోహిత్ ఈ ఘనత సాధించాడు. ప్రస్తుతం భారత గడ్డపై రోహిత్ 125 సిక్స్‌లతో మొదటి స్థానంలో ఉండగా.. ధోనీ (123) రెండో ప్లేస్‌కు పడిపోయాడు. 71 సిక్సర్లతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Read Also: Prabhas Maruthi: సైలెంట్ గా కానిచ్చేస్తున్నారుగా…
అయితే కొంతకాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్.. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి వన్డేలోనూ నిరాశపరిచాడు. 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. విరాట్ కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) కూడా తక్కువ స్కోర్లకే వెనుదిరగడంతో టీమిండియా 110 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కాగా ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్.. జట్టులో మూడు మార్పులు చేసినట్లు తెలిపాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వగా వారి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌కు చోటిచ్చారు. ఇక గాయంతో సిరీస్‌కు దూరమైన శ్రేయస్ అయ్యర్ ప్లేస్‌లో పాకెట్ డైనమో ఇషాన్ కిషన్‌కు అవకాశం లభించింది.