న్యూజిలాండ్‌తో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో కొద్దిలో ఓటమి నుంచి తప్పించుకుని ఊపిరి పీల్చుకుంది టీమిండియా. భారీ స్కోర్ చేసినా బౌలర్ల వైఫల్యంతో చివరి వరకు గెలుపుపై పూర్తి ధీమా లేకపోయింది. కాగా నేడు జరగబోయే రెండో వన్డేలో అయినా కివీస్‌పై రోహిత్‌సేన పూర్తి ఆధిపత్యం వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాయ్‌పూర్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత జట్టు చూస్తుండగా.. ఇందులోనైనా విజయం సాధించి సిరీస్ సమం చేయాలని న్యూజిలాండ్ ఉవ్విళ్లూరుతోంది.
Also Read : Woman Died Violently: ఓయూలో ఆత్మహత్య కలకలం.. బిల్డింగ్‌పై నుంచి దూకిన యువతి
రెండో మ్యాచ్ జరగబోయే షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో వర్షం పడే అవకాశం అయితే ఏమాత్రం లేదని తెలుస్తోంది. ప్రేక్షకులు పూర్తి 100 ఓవర్ల ఆటను ఆస్వాదించొచ్చు. మ్యాచ్ జరిగే సమయంలో 25 డిగ్రీల సెల్సియస్ నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రత ఉంటుందని నిపుణుల అంచనా. అయితే సాయంత్రం తర్వాత మాత్రం మంచు ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా జరగలేదు. ఇదే తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. అయితే ఇక్కడ జరిగిన కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌ల ఫలితాలను గమనిస్తే.. ఈ పిచ్ నుంచి పేసర్లకు, స్పిన్నర్లకు కూడా మంచి సహకారం లభిస్తుందని చెప్పవచ్చు.దీంతో ఈ మ్యాచ్‌లో స్కోర్లు 240-250 మధ్య ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్ తయారు చేస్తే మాత్రం ఉప్పల్ వన్డే మాదిరి భారీ స్కోర్లు ఆశించవచ్చు.
Also Read : Rashmi Gautham : రష్మీ గౌతమ్ ఇంట విషాదం..
కాగా, తొలి వన్డేలో విఫలమైన స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో సెంచరీలు బాదాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అలాగే ఉప్పల్‌లో డబుల్ సెంచరీతో మెరిసిన శుభ్‌మన్ గిల్‌పైనా మంచి అంచనాలున్నాయి. ఇషాన్ కిషన్, సూర్య, హార్దిక్ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదు. ఇక తొలి వన్డేలో విధ్వంసం సృష్టించిన న్యూజిలాండ్ బ్యాటర్ బ్రేస్‌వెల్‌తో భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి. మొదటి మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నా కూడా కివీస్ బౌలర్లను తక్కువ అంచనా వేయలేం. ఫెర్గుసన్, శాంట్నర్, టిక్నెర్, షింప్లే, బ్రేస్‌వెల్‌లకు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగల సత్తా ఉంది.