T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. గురువారం నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రోహిత్ సత్తా చాటుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ మూడు సిక్సర్లు బాదాడు. దీంతో టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో రోహిత్ అగ్రస్థానానికి చేరాడు. గతంలో ఈ రికార్డు యువరాజ్ పేరిట ఉండేది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ చరిత్రలో రోహిత్ 34 సిక్సర్లు కొట్టగా…
IND Vs PAK: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు అతి పెద్ద సమరం జరగనుంది. భారత్-పాకిస్థాన్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ వరల్డ్ కప్‌లో ఈ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్ మరోదానికి లేదు. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు లక్ష మంది అభిమానులు మెల్బోర్న్ స్టేడియానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించిన షమీని రోహిత్ జట్టులోకి తీసుకున్నాడు.…
Babar Azam: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మరో మైలురాయిని అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో హాఫ్ సెంచరీతో రాణించిన బాబర్ ఆజమ్ ఒకేసారి టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను సమం చేశాడు. క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ అంతర్జాతీయ టీ20 కెరీర్లో 28వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో టీ20ల్లో వేగంగా 28 హాఫ్ సెంచరీల ఘనత సాధించిన ఆటగాడిగా విరాట్…
Rohir Sharma: దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరిగిన చివరి టీ20లో టీమిండియా పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుతిరిగాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అతడు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. రోహిత్ డకౌట్‌గా వెనుతిరగడం ఇది 43వ సారి. దీంతో ఇంటర్నేషనల్ టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు సున్నా స్కోరుకే అవుటైన ఆటగాడిగా చరిత్ర నెలకొల్పాడు. గతంలో ఐర్లాండ్ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ పేరుతో ఈ రికార్డు ఉండేది. అతడు 42…
Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. అతడి స్థానంలో మరో ఆటగాడిని త్వరలో ఎంపిక చేస్తామని తెలిపింది. దీంతో బుమ్రా స్థానంలో ఎవరు ఎంపికవుతారనే చర్చలు మొదలయ్యాయి. సీనియర్ బౌలర్ షమీని తీసుకుంటారా లేదా దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణించిన దీపక్ చాహర్‌ను ఎంపిక చేస్తారా అంటూ పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సునీల్ గవాస్కర్ లాంటి మాజీ…