Team India: మైదానంలోకి దూసుకెళ్లాడు.. రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: గతంలో సచిన్, గంగూలీ అంటే ఎంతో మంది క్రికెట్ అభిమానులు ఇష్టపడేవారు. వాళ్లు రిటైర్ అయిన తర్వాత వాళ్ల స్థానాలను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆక్రమించారు. వీళ్లిద్దరూ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానించే వాళ్లు ఉన్నారు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన రాయ్‌పూర్ వన్డేలో ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. తన అభిమాన క్రికెటర్ అయిన రోహిత్ శర్మ గట్టిగా హగ్ చేసుకున్నాడు. ఈ ఊహించని ఘటనతో మైదానంలోని భద్రతా సిబ్బంది షాక్ తిన్నారు. వెంటనే అప్రమత్తమై ఆ అభిమానిని మైదానం నుంచి తీసుకెళ్లారు. దాంతో మ్యాచ్ కాసేపు నిలిచి పోయింది.
Read Also: Drone Hulchul in Tirumala Live: తిరుమలలో డ్రోన్ కలకలం .. ఎన్టీవీ చేతిలో వీడియో
Also Read
- India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
- IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
భారత్ ఇన్నింగ్స్ సందర్భంగా బ్లెయిర్ టిక్‌నెర్ వేసిన 10వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని రోహిత్ సిక్సర్ బాదగా.. అనంతరం ఆ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చాడు. అయితే మైదానంలోకి దూసుకొచ్చిన రోహిత్ శర్మ అభిమాని ఓ 12 ఏళ్ల బాలుడు కావడం విశేషం. రోహిత్ శర్మ అంటే తనకు ఎంతో ఇష్టం కావడంతో అతడు తన అభిమాన క్రికెటర్‌ను కలిసేందుకు ఇలా సాహసానికి ప్రయత్నించాడు. తనను కౌగిలించుకునేందుకు వచ్చిన బాలుడిని వదిలేయాలని సెక్యూరిటీ సిబ్బందికి రోహిత్ శర్మ చెప్పడం పలువురిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!