INDvsNZ ODI: కదంతొక్కిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ 108 ఆలౌట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయ్‌పూర్ వన్డేలో టీమిండియా బౌలర్లు దుమ్ములేపారు. తొలి వన్డేలో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న మన బౌలర్లు ఈ మ్యాచ్‌లో మాత్రం చెలరేగిపోయారు. కలిసికట్టుగా ప్రత్యర్థి బ్యాటర్ల భరతం పట్టారు. దీంతో మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కివీస్ 34.3 ఓవర్లలో 108 రన్స్‌కే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో షమీ (3), పాండ్యా (2), సుందర్ (2) వికెట్లతో ఆకట్టుకోగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికే ఫిన్ అలెన్ (0)ను ఔట్ చేసి న్యూజిలాండ్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు షమీ. అనంతరం సిరాజ్ వేసిన ఆరో ఓవర్లో హెన్రీ నికోలస్ (2), హార్దిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం డారైల్ మిచైల్ (1), టామ్ లాథమ్ (1), కాన్వే (7) వికెట్లు కోల్పోయిన కివీస్ 10 ఓవర్లలో 15 5తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అనంతరం ఫిలిప్స్‌తో కలిసి బ్రేస్‌వెల్ కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ 19వ ఓవర్లో మరోసారి బౌలింగ్‌కు వచ్చిన షమీ మొదటి వన్డేలో వీరోచితంగా పోరాడిన బ్రేస్‌వెల్ (22) వికెట్ తీసి టీమిండియా శిబిరంలో మరింత ఉత్సాహాన్ని నింపాడు. దీంతో కివీస్ స్కోర్ 100 దాటడమే కష్టంగా కనిపించింది. అయితే ఫిలిప్స్‌తో జతకలిసిన శాంట్నర్ భారత బౌలర్లను కాసేపు కాచుకున్నాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 47 రన్స్ జోడించి స్కోర్‌ను 100 దాటించారు. కాగా కాసేపటికే శాంట్నర్ (27)ను పాండ్యా బౌల్డ్ చేశాడు. అనంతరం ఫిలిప్స్ (36)ను సుందర్ పెవిలియన్ పంపగా.. ఫెర్గుసన్ (1), టిక్నెర్ (2), త్వరత్వరగా ఔట్ కావడంతో కివీస్ 108 రన్స్‌కు ఆలౌటైంది.
Also Read
- BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
- Team India Squad: ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు భారత్ జట్టు ప్రకటన.. కొత్త వాళ్లకు చోటు..
- Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
- Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!