Rohit Sharma: రేపు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేలో టీమిండియా తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. ఈ సిరీస్‌లో బలమైన టీమ్‌తో తాము ఆడబోతున్నామని.. తమ శక్తి సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి తమకు ఇది మంచి అవకాశమని రోహిత్ అన్నాడు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడని ఇషాన్ కిషన్‌కు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అవకాశం కల్పిస్తామని.. అతడిని మిడిల్ ఆర్డర్‌లో పంపిస్తామని రోహిత్ స్పష్టం చేశాడు. సిరాజ్ బౌలింగ్ అద్భుతంగా వేస్తున్నాడని.. మ్యాచ్ మ్యాచ్‌కు అతని గ్రాఫ్ పెరుగుతూనే ఉందని.. కొత్త బాల్‌తో వికెట్స్ తీస్తున్నాడని ప్రశంసలు కురిపించాడు.
Read Also: BJP Mission 2024: సమయం లేదు మిత్రమా.. సమరానికి సిద్ధం కావాలి..
కాగా హైదరాబాద్‌లో తొలిసారి హోమ్ గ్రౌండ్‌లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్‌కు రోహిత్ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. మూడు ఫార్మాట్లలో సిరాజ్ ముఖ్యమైన ఆటగాడు అని.. ప్రపంచకప్ నాటికి అతడిపై వర్క్ లోడ్ పెంచుతూ సిద్ధం చేస్తామన్నాడు. బుమ్రా గైర్హాజరీలో సిరాజ్ జట్టులో ప్రధాన బౌలర్‌గా సేవలందిస్తున్నాడని.. కచ్చితంగా రానున్న వన్డే వరల్డ్‌కప్‌లో అతడు కీలకం అవుతాడని రోహిత్ చెప్పాడు. ప్రత్యర్థి జట్టు బలాబలాలపై ఎక్కువగా ఆలోచించకుండా తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి ఈ సిరీస్‌లో రాణించేందుకు కృషి చేస్తామని రోహిత్ తెలిపాడు. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్ తమకు అందుబాటులో ఉన్నారని.. వాళ్లు రాణిస్తారని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు.