గురువారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు
తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరుమీదున్న టీమిండియా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి.
Team India: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ క్రీడా స్పూర్తిని చాటుకున్నాడు. శ్రీలంకతో మంగళవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ మన్కడింగ్ రనౌట్‌కు ప్రయత్నించగా రోహిత్ శర్మ నిరాకరించాడు. షమీ చేసిన అప్పీల్‌ను వెనక్కు తీసుకునేలా చర్యలు తీసుకుని అందరి మనసులను గెలుచుకున్నాడు. అసలు ఏం జరిగిందంటే.. శ్రీలంక ఇన్ని్ంగ్స్ జరుగుతున్న సమయంలో మహ్మద్ షమీ చివరి ఓవర్ వేశాడు. అయితే నాలుగో బంతి సమయంలో శ్రీలంక కెప్టెన్ షనక 98 పరుగులతో నాన్ స్ట్రైకింగ్‌లో…
IND Vs SL: గౌహతి వేదికగా టీమిండియాతో జరగనున్న తొలి వన్డేలో శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. అయితే వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయాలు తీసుకున్నాడు. తుది జట్టులో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ లాంటి ఆటగాళ్లను తీసుకోలేదు. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకోగా.. వన్డేల్లో నిలకడగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు అవకాశం కల్పించాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్…
Team India: టీమిండియా ఆటగాళ్లు ఇటీవల కాలంలో తరచూ గాయాల పాలవుతున్నారు. దీంతో జట్టు ప్రణాళికలు దెబ్బతింటున్నాయి. ఆసియాకప్, టీ20 ప్రపంచకప్‌లలో టీమిండియా ఓటమికి ఒకరకంగా గాయాలు కూడా కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా మ్యాచ్ విన్నర్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు వీళ్లు జట్టులో ఉండి తీరాల్సిందే. అయితే గత 35 నెలల్లో వీళ్లు ఆడిన వన్డేలు ఎన్నో…
Kapil Dev: టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేవలం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై ఆధారపడి వన్డే ప్రపంచకప్ గెలవలేమని కపిల్ దేవ్ అన్నాడు. ఇద్దరు లేదా ముగ్గురు ఆటగాళ్లపై ఆధారపడితే మెగా టోర్నీలు గెలవలేమని.. కనీసం నలుగురు లేదా ఐదుగురు మ్యాచ్ విన్నర్లు ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ దిశగా టీమ్ మేనేజ్మెంట్ ప్రణాళికలు రచించాలని కపిల్ దేవ్ సూచించాడు. ఒకవేళ కప్ గెలవాలని అనుకుంటే.. కోచ్, సెలక్టర్లు, జట్టు…