న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలింగ్‌తో అదరగొట్టింది. న్యూజిలాండ్‌ను 108 రన్స్‌కే ఆలౌట్ చేసింది. అయితే ఈ మ్యాచ్ టాస్ సమయంలో రోహిత్‌కు వింత అనుభవం ఎదురైంది. టాస్ గెలిచాక హిట్‌మ్యాన్.. తన నిర్ణయం ఏంటనేది చెప్పుకుండా నిలబడిపోయాడు. టాస్ నిర్ణయం కోసం వచ్చిన నిర్వాహకులు, న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ కూడా రోహిత్ ఏం చెప్తాడా? అని ఎదురు చూస్తూ ఉండిపోయారు. ఇలా కాసేపు ఆలోచించిన తర్వాత ముందుగా బౌలింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు.
INDvsNZ ODI: కదంతొక్కిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ 108 ఆలౌట్
“రోహిత్ ఏం చేస్తున్నావ్ అక్కడ?” అని రవిశాస్త్రి అడిగాడు. “టీమ్ మీటింగ్‌లో కూడా ముందుగా బౌలింగ్ చేయాలా? బ్యాటింగ్ చేయాలా? అని చర్చించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉండిపోయా” అని హిట్‌మ్యాన్ చెప్పాడు. దీంతో రోహిత్ చేసిన పనితో లాథమ్‌తో పాటు శ్రీనాథ్, రవిశాస్త్రిలు పగలబడి నవ్వుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తూ రోహిత్ ఫన్నీ టైమింగ్‌పై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్‌ను అద్భుతంగా ప్రారంభించావంటూ ప్రశంసిస్తున్నారు.
కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 34.3 ఓవర్లలో 108 రన్స్‌కే ఆలౌటైంది. న్యూజిలాండ్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (36), శాంట్నర్ (27), బ్రేస్‌వెల్ (22) మాత్రమే కాసేపు పోరాడారు. అలెన్ (0), కాన్వే (7), నికోలస్ (2), మిచెల్ (1), లాథమ్ (1), ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. టీమిండియా బౌలర్లలో షమీ (3), పాండ్యా (2), సుందర్ (2) వికెట్లతో ఆకట్టుకోగా.. సిరాజ్, శార్దూల్, కుల్దీప్ చెరో వికెట్ దక్కించుకున్నారు.