వన్డే సిరీస్‌లో భాగంగా శనివారం (డిసెంబర్ 6) విశాఖపట్నంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. రాంచీ, రాయ్‌పుర్‌లో రెండు మ్యాచ్‌లు ముగియగా.. సిరీస్ 1-1తో సమంగా ఉంది. వైజాగ్‌లోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో మూడో మ్యాచ్ మధ్యాహ్నం 1.30కు ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి.. సిరీస్ విజేతగా నిలవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. దాంతో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. అయితే వైజాగ్‌లో భారత్‌కు ఉన్న ఏకైక ప్రయోజనం…
Ravi Shastri: టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌పై అనవసరంగా విమర్శలు చేస్తూ, వారి భవిష్యత్తును గందరగోళంలోకి నెడుతున్న వారికి భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి గట్టి హెచ్చరిక జారీ చేశారు.
భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. వరుసగా రెండు సెంచరీలతో విమర్శకుల నోళ్లు మూయించాడు. రాంచీ వన్డేలో 120 బంతుల్లో 153 రన్స్ చేసిన కింగ్.. రాయపూర్ వన్డేలో 93 బంతుల్లో 102 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్లో విరాట్ వరుసగా సెంచరీలు చేయడం ఇది 11వ సారి. తనను ‘కింగ్’ అని ఎందుకు పిలుస్తారో కోహ్లీ మరోసారి నిరూపించాడు. ఇక…
వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ 2026 జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ జరగనుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనుంది. అయితే 2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు కోసం కొత్త జెర్సీని బీసీసీఐ సిద్ధం చేసింది. ఈ జెర్సీని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తెలుగు…
టీమిండియా స్టార్ బ్యాటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో 41 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 20,000 పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత బ్యాటర్‌గా రికార్డుల్లో ఎక్కుతాడు. ఈ క్లబ్లో దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ మాత్రమే ఉన్నారు. రాయ్‌పుర్‌లో దక్షిణాఫ్రికాతో నేడు జరిగే రెండో వన్డేలో హిట్‌మ్యాన్ ఈ రికార్డును చేరుకునే అవకాశాలు…
టీమిండియా సీనియర్ బ్యాటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 2007 టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నప్పుడు తాను స్కూల్లో ఉన్నానని దక్షిణాఫ్రికా సారథి తెంబా బావుమా గుర్తుచేసుకున్నాడు. ఇప్పటికీ హిట్‌మ్యాన్ రోహిత్ భారత జట్టులో ఉన్నాడని, అతడు ప్రపంచ స్థాయి ప్లేయర్ ప్రశంసించాడు. రోహిత్, విరాట్ కోహ్లీ రాకతో భారత జట్టు బలంగా మారిందని బావుమా చెప్పాడు. తొలి వన్డేకు దూరంగా ఉన్న బావుమా.. రెండో వన్డేలో ఆడనున్నాడు. రెండో వన్డే నేపథ్యంలో మంగళవారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో…
Internal Conflict In Team India: భారత్- ఆస్ట్రేలియా తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియాలో ఉత్సాహం పెరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రెస్సింగ్ రూంలో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉందని సమాచారం.
భారత సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో చెలరేగిన విషయం తెలిసిందే. కోహ్లీ సెంచరీతో (137) చెలరేగగా.. రోహిత్ (57) అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. రో-కోలు రెండో వికెట్‌కు 109 బంతుల్లోనే 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా పవర్ ప్లేలో 80 పరుగులు రాబట్టారు. దాంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రో-కోలు ఇద్దరు…
India vs South Africa 1st ODI: రాంచీలో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు దక్షిణాఫ్రికాకు భారీ స్కోరు టార్గెట్ ను నిర్ధేశించింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బౌలింగ్ ఎంచుకోగా.. భారత బ్యాటర్లు దానిని సద్వినియోగం చేసుకుని 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 భారీ స్కోరును నమోదు చేసింది. పరుగుల వర్షం మొదలుపెట్టిన రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కలిసి మంచి ఆరంభం ఇచ్చారు. అయితే యశస్వి (18) త్వరగా వెనుదిరిగినా..…