IND beat AFG in Second Super Over: అఫ్గానిస్థాన్, భారత్ జట్ల మధ్య నామమాత్రమనుకున్న మ్యాచ్.. సిక్సులు, ఫోర్లు, నరాలు తెగే ఉత్కంఠతో అభిమానులకు అసలైన మజాను అందించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి.. మంచి వినోదాన్ని పంచింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో బుధవారం ఉత్కంఠ రేపిన మూడో టీ20లో రెండో సూపర్ ఓవర్లో అఫ్గానిస్థాన్‌ను భారత్ ఓడించింది. ముందుగా మ్యాచ్ టై (212 పరుగులు) కాగా.. తొలి సూపర్ ఓవర్ ఓవర్లో ఇరు జట్లు 16…
టీమిండియా, అఫ్ఘనిస్థాన్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో అఫ్ఘాన్ బౌలర్లకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, రింకూ సింగ్ చుక్కలు చూపించారు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (121), రింకూ సింగ్ (69) అజేయంగా నిలిచారు. ఒకానొక దశలో టీమిండియా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత రోహిత్, రింకూ నిలకడగా ఆడి అఫ్ఘాన్ బౌలర్లకు ఊచకోత…
మరో 6 నెలల తర్వాత టీమిండియా టీ20 ప్రపంచ కప్ ఆడనుంది. అయితే.. ఈ ప్రపంచకప్‌కు భారత కెప్టెన్ ఎవరు? అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ టీ20ల్లోకి తిరిగి వచ్చాడు. అంతకుముందు హార్దిక్ పాండ్యా టీ20లకు సారథ్య బాధ్యతలు వహించాడు. ఈ క్రమంలో.. కెప్టెన్సీపై టీమిండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
వెస్టిండీస్, యూస్ఏలలో జరగబోయే ICC టీ20 ప్రపంచ కప్ లో భారత సీనియర్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఓపెనింగ్ చేయాలని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా కోరాడు. ఈ పిచ్ ల్లో మొదటి ఆరు ఓవర్లలో ఎక్కువ పరుగులు చేసే అవకాశాలు ఉంటాయని.. కాబట్టి వీరి జోడి మంచిగా పరుగులు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పాడు. చోప్రా తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. 2023 వన్డే ప్రపంచకప్‌లో చూసినట్లుగా పవర్‌ప్లే ఓవర్లలో కోహ్లీ…
Indore T20 Records Ahead Of IND vs AFG 2nd T20: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. ఇండోర్ టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. స్టార్లతో నిండిన టీమిండియాకు ఇది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు…
Rohit Sharma On Verge Of Historic Milestone: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు చేరనుంది. నేడు రోహిత్ మైదానంలోకి దిగగానే.. 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మొదటి క్రికెటర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా 150 అంతర్జాతీయ టీ20లు…
ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సీరీస్ నేపథ్యంలో బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. తొలి రెండు టెస్టులకు పదహారు మందితో కూడిన టీమ్ ను ఎంపిక చేసినట్లు పేర్కొనింది.
Rohit Sharma Reacts on His Run Out After Shubman Gill Mistake: గురువారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికి హిట్‌మ్యాన్ రనౌట్ అయ్యాడు. అఫ్గాన్ పేసర్ ఫజల్హాక్ ఫారూఖీ వేసిన బంతిని రోహిత్ మిడాఫ్ దిశగా షాట్ ఆడి.. సింగిల్‌కు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ఇబ్రహీమ్ జద్రాన్ డైవ్ చేసి మరీ బంతిని ఆపాడు. అప్పటికే…
Most Games won in Men’s T20I Cricket: టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో 100 విజయాల్లో భాగమైన తొలి పురుష క్రికెటర్‌గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించడం ద్వారా రోహిత్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. రోహిత్ ఈ ఘనతను 149 మ్యాచ్‌ల్లో అందుకున్నాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాల్లో భాగమైన రికార్డు…
దాదాపు ఏడాది తర్వాత రోహిత్, కోహ్లీ టీ20 జట్టులోకి తిరిగి వచ్చారు. దీంతో.. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో వీరిద్దరూ ఆడే అవకాశాలు పెరిగాయి. ఈ విషయాలన్నింటిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మీడియాతో మాట్లాడారు. భారత్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రేపటి (గురువారం) నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సిరీస్ టీమిండియాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే.. టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇదే చివరి…