IND vs ENG Test: లంచ్ బ్రేక్.. భారత్ స్కోర్ 93/3! ఇంగ్లండ్‌దే మొదటి సెషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rohit Sharma hits Half Century at Day 1 Lunch Break: రాజ్‌కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలిరోజు ఆటలో మొదటి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 93 రన్స్ చేసింది. రోహిత్ శర్మ (52), రవీంద్ర జడేజా (24) క్రీజ్‌లో ఉన్నారు. యశస్వి జైస్వాల్ (10), శుభ్‌మన్ గిల్ (0), రజత్ పటీదార్ (5) పరుగులకే ఔటయ్యారు. మార్క్ వుడ్ 2 వికెట్స్ పడగొట్టగా.. టామ్ హర్ట్‌లీ 1 వికెట్ పడగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే దెబ్బకొట్టిన ఇంగ్లండ్.. మొదటి సెషన్‌లో ఆధిపత్యం చెలాయించింది.
ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మార్క్ వుడ్ వేసిన నాలుగో ఓవర్ ఐదవ బంతికి స్లిప్‌లో ఉన్న జో రూట్‌కు యశస్వి జైస్వాల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాసేపటికే మార్క్ వుడ్ మరో వికెట్ పడగొట్టాడు. అతడు వేసిన 6వ ఓవర్ నాలుగో బంతి శుభ్‌మన్ గిల్ బ్యాట్ ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. 9వ ఓవర్ ఐదవ బంతికి టామ్ హార్ట్‌లీ బౌలింగ్‌లో కవర్స్‌లో ఉన్న బెన్ డకెట్‌కు క్యాచ్ ఇచ్చి రజత్ పటీదార్ ఔట్ అయ్యాడు.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: Dunki OTT: ఓటీటీలోకి వచ్చేసిన షారుఖ్ ఖాన్ ‘డంకీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
9 ఓవర్లకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కెప్టెన్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. రెండు లైఫ్‌లు దక్కడంతో బతికిపోయిన రోహిత్.. దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో 71 బంతుల్లో హాఫ్ సెంచరీ (51) చేశాడు. ఈ సిరీస్‌లో ఇదే తొలి హాఫ్ సెంచరీ కావడం విశేషం. మరోవైపు రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోయాడు. చెత్తబంతులను బౌండరీలు తరలిస్తూ.. పరుగులు చేస్తున్నాడు. రెండో సెషన్‌లో ఈ ఇద్దరు నిలిస్తే భారత్ మెరుగైన స్కోర్ చేసే అవకాశాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!