Rohit Sharma React on Rajkot Pitch: భారత జట్టు ఎలాంటి పిచ్‌లపై అయినా విజయం సాధిస్తుందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టర్నింగ్ ట్రాక్‌లపై సుడులు తిరిగే బంతిని ఎదుర్కోవడంతో పాటు మిగతా పిచ్‌ల పైనా ఆడటం తమ బలం తెలిపాడు. పలానా పిచ్ తయారు చేయాలని ఎవరికీ చెప్పమని, అసలు పిచ్ గురించి చర్చించం అని రోహిత్ పేర్కొన్నాడు. మ్యాచ్‌కు రెండు రోజుల ముందే వేదిక వద్దకు వెళ్తామని, ఆ తక్కువ వ్యవధిలో తాము చేసేదేముంటుంది? అని ప్రశ్నించాడు. భారత్ టర్నింగ్ పిచ్‌ల సాయంతో విజయాలు సాధిస్తుందనే కామెంట్లు వచ్చిన నేపథ్యంలో ఇలా రోహిత్ స్పందించాడు.
జ్‌కోట్ టెస్టులో ఇంగ్లండ్‌ను 434 పరుగుల భారీ తేడాతో భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు మూడో సెషన్‌లో బంతి బాగా టర్న్ అవ్వడంతో భారత స్పిన్నర్లు చెలరేగారు. రవీంద్ర జడేజా ఐదు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్ 2, ఆర్ అశ్విన్ 1 వికెట్ తీశారు. భారత్ టర్నింగ్ పిచ్‌ల సాయంతో విజయాలు సాధిస్తుందనే కామెంట్ల నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ… ‘టర్నింగ్ పిచ్‌లపై ఇప్పటికే మేం చాలా మ్యాచ్‌లు గెలిచాం. ఇలాంటి ట్రాక్‌లపై మాత్రమే కాదు మిగతా పిచ్‌ల పైనా మేం బాగా ఆడుతాము. భవిష్యత్తుల్లోనూ మంచి ఫలితాలు సాధిస్తాం. పలానా (టర్నింగ్) పిచ్ తయారు చేయాలని ఎవరికీ చెప్పం. మ్యాచ్‌కు రెండు రోజుల ముందే వేదిక వద్దకు వెళ్తాం. అంత తక్కువ వ్యవధిలో మేం చేసేదేముంటుంది?. పిచ్‌ను ఎలా తయారు చేయాలనేది క్యూరేటర్ ఇష్టం. ఎలాంటి మైదానంలో అయినా గెలవగల సత్తా టీమిండియాకు ఉంది. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో మేం అద్భుత విజయం సాధించాం. ఆ పిచ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు’ అని అన్నాడు.
Also Read: Ranchi Test: కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తే.. అతడిపై వేటు తప్పదు! యశస్వి డౌటే
‘ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల్లో భిన్న సవాళ్లు ఎదుర్కొన్నాం. హైదరాబాద్ పిచ్ మందకొడిగా ఉంది. స్పిన్ అయినా బంతి చాలా స్లోగా వచ్చింది. వైజాగ్‌లో మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ నెమ్మదించింది. రాజ్‌కోట్‌లో నాలుగో రోజు బంతి టర్న్ అయింది. భారత్‌లో ఇలాంటి పరిస్థితులు సాధారణం. విదేశాల్లోనూ ఇలాంటి పిచ్‌లు ఉంటే.. అక్కడా మేం నాణ్యమైన ప్రదర్శన చేస్తాం. మూడో టెస్టులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. సొంత మైదానంలో జడేజా అదరగొట్టాడు. జైస్వాల్, గిల్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక సర్ఫరాజ్ ఖాన్ గురించి అంతకుముందు విన్నా కానీ.. అతడి బ్యాటింగ్ చూడలేదు. జట్టులోకి తీసుకున్నాక అతడి గురించి ఎక్కువగా చర్చించలేదు. ఎందుకంటే ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. సర్ఫరాజ్‌ను అతడి సహజ ఆటను ఆడించాం’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.