Virat Kohli Fan Touches Rohit Sharma’s Feet: హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం మొదటి టెస్ట్ ఆరంభం అయిన విషయం తెలిసిందే. చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగుతుండడంతో ఫాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మైదానంలో తమ అభిమాన క్రికెటర్లను చూస్తూ.. సంబరపడిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. మైదానంలోకి దూసుకొచ్చిన ఓ అభిమాని.. బ్యాటింగ్ చేస్తున్న…
Rohit Sharma Breaks Silence On Virat Kohli’s Replacement in INS vs ENG Test: విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్ అని, అతడు జట్టుకు దూరమవ్వడం పెద్ద లోటే అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. గేమ్‌ను విరాట్ మరో లెవల్‌కి తీసుకెళ్లాడని, గత కొన్నేళ్ళుగా భారత జట్టుకు ఆడుతూ ఎన్నో రికార్డులు సాధించాడన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లండ్‌తో జరిగే మొదటి రెండు టెస్టులకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమైన…
ఇంగ్లండ్ ఎలాంటి బౌలింగ్ చేస్తుందని, వారి బ్యాటింగ్ ఎలా ఉంటుందనే దానిపై తాను పెద్జగా దృష్టి సారించనని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాము ఎలా ఆడాలనే దానిపై మాత్రమే దృష్టి సారిస్తామన్నాడు. కేప్‌టౌన్‌లో ఆడిన వాతావరణం వేరని, హైదరాబాద్ వాతావరణం వేరని రోహిత్ తెలిపాడు. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా గురువారం (జనవరి 25) నుంచి ప్రారంభంకానుంది.…
6 Indians included in ICC Men’s ODI Team of the Year 2023: మంగళవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ‘వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్’లో ఏకంగా ఆరుగురు భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఎలైట్ టీమ్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. 2023 సంవత్సరంలో అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లు…
2023 ఏడాదికి సంబంధించి అత్యుత్తమ టీ20 జట్టును ఐసీసీ ఈరోజు ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కాగా.. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, స్పిన్నర్ రవి బిష్ణోయ్, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లకు చోటు కల్పించింది. సూర్యకుమార్ తో మొత్తం నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Most Sixes Record for India in Test Cricket: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జనవరి 25 నుంచి ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే ఇరు జట్లు సన్నద్ధం అవుతున్నాయి. ఆదివారం ఇంగ్లీష్ జట్టు హైదరాబాద్ చేరుకుంది. నేడు ఉప్పల్ స్టేడియంలో ఇరు జట్లు ప్రాక్టీస్ చేయనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా…
Ayodhya Ram Mandir Guest List: ఎన్నో వివాదాలు, మరెన్నో న్యాయ పోరాటాలను అధిగమించి శ్రీరాముడికి శాశ్వత నివాసాన్ని నిర్మించాలన్న ప్రయత్నం ఎట్టకేలకు నెరవేరబోతోంది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. దేశంలోని వివిధ రంగాలకు చెందిన దిగ్గజాలను సోమవారం అయోధ్యలో జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రత్యేక అతిథులుగా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి దాదాపు 8,000 మంది అతిథులు రానున్నారు. ఇందులో క్రీడా ప్రముఖులు కూడా ఉన్నారు. క్రికెట్…
Rohit Sharma react on Virat Kohli Golden Duck in IND vs AFG 3rd T20: స్వదేశంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లో స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తమ టీ20 పునరాగమనం చేశారు. 3వ టీ20లో రోహిత్ సెంచరీతో సత్తాచాటాడు. అయితే వ్యక్తిగత కారణాలతో మొదటి టీ20 ఆడని కోహ్లీ.. రెండో మ్యాచ్‌లో 16 బంతుల్లో 29…
Rohit Sharma React on India Team for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 ముందు అఫ్గానిస్థాన్‌తో ఆఖరి పొట్టి సిరీస్‌ను భారత్ ఆడేసింది. ఇక జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరిగే పొట్టి కప్పులోనే నేరుగా భారత జట్టు బరిలోకి దిగనుంది. అయితే టీ20 ప్రపంచకప్ కోసం ఇంకా భారత జట్టు ఖరారు కాలేదని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. కానీ పొట్టి టోర్నీలో ఆడే 8-10 ఆటగాళ్లెవరో తమ…
Most Hundreds in T20: అఫ్గానిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. హిట్‌మ్యాన్ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 121 పరుగులు బాదాడు. 2019 తర్వాత టీ20 ఫార్మాట్లో తన తొలి సెంచరీ నమెదు చేశాడు. అంతేకాదు అంతర్జాతీయ టీ20లలో రోహిత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ సెంచరీతో టీ20ల్లో రోహిత్ సరికొత్త…