India complete 4-1 series: ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తిప్పేయడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 195 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో భారత్ ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ (84) హాఫ్ సెంచరీతో పోరాడగా.. జానీ బెయిర్‌స్టో (39) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం అశ్విన్ 9 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 4-1తో సొంతం చేసుకుంది.
మూడో రోజైన శనివారం ఓవర్ నైట్ స్కోర్ 473/8తో మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 477 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే భారత్ కుల్దీప్ యాదవ్ (30), జస్ప్రీత్ బుమ్రా (20)వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ 5 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకే ఆలౌటైవడంతో రోహిత్ సేనకు 259 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే షేక్స్ తగిలాయి. ఆర్ అశ్విన్ దెబ్బకు ఓపెనర్‌లు బెన్ డకెట్ (2), జాక్ క్రాలే (0), ఒలీ పోప్ (19)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఈ సమయంలో జానీ బెయిర్‌స్టో, జో రూట్‌లు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. బెయిర్‌స్టో (39)ను కుల్దీప్ యాదవ్ వికెట్ల ముందు దోరకబుచ్చుకున్నాడు. కాసేపటికే బెన్ స్టోక్స్ (2)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు.
Also Read: Kalyana Lakshmi: కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఘర్షణ!
మూడో రోజు భోజన విరామం సమయానికి ఇంగ్లండ్ ఐదు వికెట్స్ కోల్పోయి 103 రన్స్ చేసింది. విరామం అనంతరం జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా కూడా చెలరేగడంతో ఇంగ్లీష్ జట్టు వెంటవెంటనే వికెట్స్ కోల్పయింది. బెన్ ఫోక్స్ (8), టామ్ హార్ట్‌లీ (20), మార్క్ వుడ్ (0), షోయబ్ బషీర్ (13) పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 195 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో.. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. ఆర్ అశ్విన్ తన వందో టెస్టు మ్యాచ్‌లో అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసిన యాష్.. రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్స్ పడగొట్టాడు. భారత్ సొంతగడ్డపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 4-1తో సిరీస్ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ , కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మొహమ్మద్ షమీ వంటి ప్రధాన ప్లేయర్స్ లేకుండానే.. యువ క్రికెటర్లతో కూడిన జట్టుతోనే భారీ విజయం అందుకుంది భారత్.
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
— BCCI (@BCCI) March 9, 2024