India vs England: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడు మ్యాచ్‌ల ODI సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరగనుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ను 4 వికెట్ల తేడాతో గెలుచుకున్న తర్వాత, టీమిండియా ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. దీనితో కటక్‌లో జరిగే రెండో వన్డే మ్యాచ్ గెలిస్తే భారత్ సిరీస్‌ను గెలుచుకుంటుంది. ఇంగ్లాండ్‌తో జరిగే ఈ వన్డే మ్యాచ్‌లో…
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నేటి నుంచి నాగ్‌పూర్‌లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక టీమిండియా నుండి హర్షిత్ రాణా, యశస్వి జైస్వాల్ భారత్ తరఫున అరంగేట్రం చేయబోతున్నారు. గాయం కారణంగా విరాట్ కోహ్లీ ఆడటం లేదు. 2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి వన్డే సిరీస్. దీనిని ఛాంపియన్స్…
IND vs ENG: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ తలపడనున్నాయి. మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలవుతుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆతిథ్య జట్టు ఇప్పటికే 4-1తో గెలుచుకుంది. ఈ నెల చివర్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో రెండు జట్లు తమ వన్డే ప్రతిభను పరీక్షించుకోవడానికి ఇది ఒక అవకాశం అవుతుంది. టీ20ల కోసం ఇంగ్లాండ్ తమ జట్టులో అనేక మార్పులు…
ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ ట్రోఫీ ఆరంభోత్సవాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కలిసి ఫిబ్రవరి 16న లాహోర్‌లో నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమంకు చారిత్రక లాహోర్ కోటలోని హుజూరి బాగ్ వేదిక కానుంది. అయితే ఐసీసీ టోర్నీ ఆరంభానికి ముందు సంప్రదాయంగా వస్తున్న అన్ని జట్ల కెప్టెన్ల ఫొటోషూట్, మీడియా సమావేశాన్ని ఈసారి నిర్వహించడం లేదని తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రధాన జట్లు…
రంజీ ట్రోఫీలో ముంబై జట్టు రోహిత్ శర్మ లేకుండానే బరిలోకి దిగనుంది. ఫిబ్రవరి 6న ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్ కోసం రోహిత్ భారత జట్టుతో చేరాడు. దీంతో గురువారం మేఘాలయాతో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ గ్రూపు-ఎ మ్యాచ్‌లో ముంబై హిట్‌మ్యాన్ లేకుండానే ఆడనుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ కూడా ముంబై తరఫున బరిలో దిగడం లేదు. వీరి స్థానాల్లో ఆంగ్క్రిష్ రఘువంశి, సూర్యాంష్ షెడ్గే, అథర్వ అంకోలేకర్‌లను…
Venkatesh Prasad: టీమిండియా మాజీ సెలెక్టర్, కోచ్ వెంకటేష్ ప్రసాద్ ఆదివారం తన టాప్-5 భారతీయ క్రికెటర్ల జాబితాను తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఈ జాబితాలో అతను ఆధునిక క్రికెట్ దిగ్గజాలుగా చెప్పుకునే విరాట్ కోహ్లీ (Virat Kohli), రోహిత్ శర్మ, ధోనీ (MS Dhoni), జస్ప్రీత్ బుమ్రా (Bumrah) వంటి ఆటగాళ్లను చేర్చలేకపోయాడు. ఈ జాబితాను ప్రసాద్ సోషల్ మీడియా వేదికగా జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన వెల్లడించారు. వెంకటేష్ ప్రసాద్ తన…
Rohit Sharma: ప్రస్తుతం ఫామ్ కోసం తెగ కష్టపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓ పదిహేనేళ్ల అభిమాని రాసిన భావోద్వేగభరితమైన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లేఖ క్రికెట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. టెస్టు, వన్డేల్లో టీమిండియా సారథిగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఇటీవల జరిగిన బోర్డర్-గావస్కర్ టోర్నీలో టీమిండియా ప్రదర్శన నిరాశజనకంగా ఉండటంతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ ఆటతీరు తగ్గిందని, క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.…
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) శనివారం 2024 పురుషుల టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్‌ని ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. రోహిత్ సారథ్యంలో భారత్ గతేడాది టీ20 ప్రపంచకప్ 2024 గెలుచుకుంది. 2024 సంవత్సరంలో అత్యుత్తమ టీ20 జట్టుగా భారత్ ఆధిపత్యం చెలాయించింది. ఈ జట్టులో నలుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
Maha Kumbh Mela 2025: ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో టి20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కోల్‌కతాలో జరిగిన మొదటి మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయం సాధించగా.. నేడు చెన్నై వేదికగా రెండో టి20 మ్యాచ్ జరుగునుంది. ఇది ఇలా ఉండగా.. తాజాగా సోషల్ మీడియాలో టీమిండియాకు సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టించిన ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. Also Read: IND…
భారత దేశవాళీ క్రికెట్ రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ క్రికెట్లో ఫామ్ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆటగాళ్లు రంజీ బరిలోకి దిగారు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజాలు రంజీ మ్యాచ్‌లలో బరిలోకి దిగారు. అయితే ఆస్ట్రేలియా పర్యటనలో మెరుగ్గా ఆడలేకపోయిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెడ నొప్పి కారణంగానే బెంచ్‌కే పరిమితం అయ్యాడు. గత కొన్ని నెలలుగా…