ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి ప్రారంభం కానుంది. కరాచీలో జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ పాకిస్థాన్- న్యూజిలాండ్‌తో తలపడటంతో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో తన మొదటి మ్యాచ్ ను ఆడనుంది. ఇక, భారత్ ఆడే మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఈ టోర్నీ మార్చి 9 వరకు కొనసాగుతుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న…
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం అయింది. ఈ వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లీష్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ వరుసగా పదో సారి టాస్ ఓడిపోయింది. ఇప్పటికే సిరీస్ గెలుచుకోవడంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడు మార్పులు చేశాడు. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీకి రెస్ట్ ఇవ్వగా.. వారి స్థానాల్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ ఎంట్రీ…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డేలో విజయం సాధించి.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. కాగా.. ఈనెల 12న మూడో వన్డే మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి టీం ఇండియా ప్లేయింగ్-11పై ఉండనుంది. ఇప్పటికే సిరీస్ గెలిచిన భారత జట్టు ఈ మ్యాచ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది.
కటక్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన తర్వాత, రోహిత్ శర్మ మ్యాచ్ తర్వాత ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎందుకు అనుకుంటున్నారా..? రోహిత్ శర్మ మాట్లాడుతున్నట్లు కనిపించిన ఫోన్ గురించి.. రోహిత్ చేతిలో ఉన్నది ఐఫోన్, ఇంకా ఏదో పెద్ద ఫోన్ కాదు.. వన్‌ప్లస్ ఫోన్ 12.
ఆదివారం కటక్‌లోని బారాబతి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని చేరుకున్నాడు. అతని అద్భుత ప్రదర్శనతో కొత్త రికార్డులు సృష్టించాడు.
టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రికార్డుల్లో నిలిచాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) చేయడంతో ఈ ఘనత సొంతమైంది. మూడు ఫార్మాట్లలో కలిపి ఓపెనర్‌గా రోహిత్ ఇప్పటి వరకు 15,404 పరుగులు చేశాడు. తద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ను హిట్‌మ్యాన్ అధిగమించాడు. సచిన్…
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసింది. జో రూట్ (69; 72 బంతుల్లో 6×4), డకెట్ (65; 56 బంతుల్లో 10×4)లు హాఫ్ సెంచరీలు బాదారు. భారీ లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ (119; 90 బంతుల్లో 12×4, 7×6) సెంచరీ…
గత కొంతకాలంగా విఫలమవుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి వచ్చేశాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ సెంచరీ (119; 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు) బాదాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన రోహిత్.. 76 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. చాలా నెలల తర్వాత హిట్‌మ్యాన్ శతకం బాదడంతో ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కీలక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముంగిట హిట్‌మ్యాన్…
ఈ రోజు మ్యాచ్ చాలా బాగనిపించిందని, తన బ్యాటింగ్‌ను ఎంతో ఎంజాయ్ చేశాను అని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. తాను చేయాల్సిన పరుగులను భాగాలుగా ఎంచుకొని రాబట్టానని, వన్డేల్లో పరిస్థితులకు తగ్గట్లుగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు తన శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని బౌలింగ్ చేసినప్పుడు.. తన ప్రణాళికలు అమలు పరిచానని హిట్‌మ్యాన్ తెలిపాడు. శుభ్‌మన్ క్లాసీ ప్లేయర్ అని, పరిస్థితులకు అనుగుణంగా ఆడుతాడని రోహిత్ ప్రశంసించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా…
రోహిత్ శర్మ చాలా కాలం విఫలమవుతున్నాడు. కానీ ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో రోహిత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడి 76 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. 16 నెలల తర్వాత రోహిత్ వన్డేల్లో సెంచరీ సాధించాడు. 7 సిక్స్ లు, 9 ఫోర్లతో చెలరేగాడు. వన్డేల్లో రోహిత్ శర్మకి ఇది రెండో ఫాస్టెస్ట్ సెంచరీ. 2023 లో ఆఫ్ఘనిస్తాన్ పై 63 బంతుల్లో సెంచరీ చేశాడు.