దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజీలాండ్ మధ్య ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ బ్యాటింగ్ లో సత్తాచాటుతోంది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. విపరీతంగా దగ్గుతూ పొట్టపట్టుకుని నేలపై కూర్చున్నాడు. ఆ సమయంలో రోహిత్ కు ఏమైందని అంతా ఆందోళన చెందారు.
Also Read:Turkey: టర్కీ మానవరహిత విమానం ప్రయోగాలు పూర్తి.. భారత్‌కి చిక్కులు..
అయితే హిట్ మ్యాన్ గొంతులో పురుగు ఇరుక్కుపోవడంతోనే అసౌకర్యానికి గురైనట్లు తెలిసింది. ఈ సమయంలో రోహిత్ శర్మ భార్య రితిక తన కూతురు సమైరాతో కలిసి చారిత్రాత్మక ఫైనల్‌ను చూస్తోంది. హిట్ మ్యాన్ అనారోగ్యానికి గురైన వెంటనే రితిక ఆందోళనకు గురైంది. రోహిత్ భారత డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తు సహాయం కోరాడు. కొన్ని సెకన్లలోనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చాడు. అయితే రోహిత్ శర్మ అనుకోకుండా ఒక పురుగును మింగాడని.. నిమిషం విరామం తర్వాత రోహిత్ కోలుకుని ఆటను ప్రారంభించాడని వెల్లడైంది. రోహిత్ శర్మ 83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో విరుచుకుపడి 76 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.