Rohit Sharma: రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ.. కీలక ప్రకటన
- రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ
- వన్డేల నుంచి తాను రిటైర్ కావడం లేదని రోహిత్ స్పష్టం
- రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ తర్వాత టీమిండియా కీలక ఆటగాళ్లు రిటైర్ మెంట్ ప్రకటించబోతున్నారంటూ చర్చలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు వీడ్కోలు పలుకుతాడని ఊహాగానాలు వెల్లువెత్తాయి. గత సంవత్సరం ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అతను T20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లుగానే ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అనంతరం వన్డేలకు రిటైర్ మెంట్ పలుకుతాడని అంతా భావించారు. అయితే ఈ పుకార్లకు రోహిత్ స్వయంగా ఫుల్ స్టాప్ పెట్టాడు. రిటైర్మెంట్ ఊహాగానాలపై హిట్ మ్యాన్ క్లారిటీ ఇచ్చాడు. వన్డేల నుంచి తాను రిటైర్ కావడం లేదని రోహిత్ స్పష్టం చేశాడు.
Also Read:US: బీచ్‌లో భారత సంతతి విద్యార్థిని అదృశ్యం.. బికినీలో ఉండగా మాయం
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మ్యాచ్ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో రోహిత్ వన్డేలు ఆడటం కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. తన భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు లేవని, కాబట్టి రిటైర్మెంట్‌కు సంబంధించి ఎలాంటి ప్రచారం చేయొద్దని మీడియాను కోరాడు. రోహిత్ ఈ విషయం చెప్పిన తర్వాత, హాలు మొత్తం చప్పట్లతో మార్మోగింది. హిట్ మ్యాన్ నిర్ణయంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే గతంలో చాలా మీడియా నివేదికలలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని ఓడిపోతే రోహిత్ నిష్క్రమణ ఖాయం అని, కానీ అది గెలిస్తే రోహిత్ ఆటను కొనసాగిస్తాడని వెల్లడించాయి.
Also Read:Final Judgement: ప్రణయ్ పరువు హత్య కేసు.. నేడే తుది తీర్పు
ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి రోహిత్ పై ఒత్తిడి ఉంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ఓటమి, ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో టెస్ట్ సిరీస్ ఓటమి రోహిత్ కెప్టెన్సీపై ప్రశ్నలను లేవనెత్తాయి. అప్పటి నుంచి ఆయన రిటైర్మెంట్ గురించి వార్తలు వచ్చాయి. కాగా రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి టీం ఇండియా మూడోసారి ట్రోఫీని కైవసం చేసుకుని, టోర్నమెంట్‌లో అత్యంత విజయవంతమైన జట్టుగా అవతరించింది. కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది రెండో ఐసీసీ ట్రోఫీ. దీంతో హిట్ మ్యాన్ ఒకటి కంటే ఎక్కువ ICC ట్రోఫీలను గెలుచుకున్న భారత రెండవ కెప్టెన్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.
ROHIT SHARMA DROPS BANGER. 🎤
– 2027 World Cup in South Africa.🤞🇮🇳 pic.twitter.com/SKPGbIOeQg
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!