ఇటీవల టెస్టుల్లో ఘోర వైఫల్యం నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్లు రంజీ బాట పట్టారు. సీనియర్ బ్యాటర్ అయినా సరే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందే అని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా సహా మరికొందరు రంజీ మ్యాచ్‌లు ఆడేందుకు సిద్దమయ్యారు. చాలా ఏళ్ల నుంచి స్టార్ ప్లేయర్స్ రంజీలు ఆడడం లేదు కాబట్టి.. ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. నేటి నుంచి…
Virat Kohli: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత రంజీ ట్రోఫీలో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్‌తో ఢిల్లీ ఆడనున్న చివరి గ్రూప్ మ్యాచ్‌కు తాను అందుబాటులో ఉన్నట్లు కోహ్లీ ప్రకటించాడు. జనవరి 30న రైల్వేస్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇది ఇలా ఉండగా.. కోహ్లీ చివరిసారిగా 2012లో ఉత్తరప్రదేశ్‌తో ఘజియాబాద్‌లో రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడాడు. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లీ ఢిల్లీకి మరోమారు ఆడబోతున్నాడు. 36 ఏళ్ల…
Champions Trophy 2025: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టును ప్రకటించనుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మీడియా ముందుకు వచ్చి జట్టులోని సభ్యుల వివరాలను వెల్లడించనున్నారు.
గత ఏడాది స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ సిరీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా పేలవ ప్రదర్శన తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. టీమిండియా పర్యటనల్లో క్రికెటర్ల కుటుంబ సభ్యుల బసపై బీసీసీఐ ఆంక్షలు విధించనుంది. విదేశీ పర్యటనల్లో కుటుంబ సభ్యులతో ప్లేయర్ వెచ్చించే సమయం, ప్రయాణాల విషయంలో కఠినమైన నిబంధనలు అమలు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. బీసీసీఐ నిబంధనలు అమల్లోకి వస్తే.. 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ…
Marnus Labuschagne: ఆస్ట్రేలియన్ క్రికెటర్ మార్నస్ లాబుషేన్ త్వరలో మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను తన ఇన్స్టాగ్రాం ఖాతా ద్వారా విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తన భార్య రెబేకా గర్భవతి అని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోటీలను ఆయన షేర్ చేశారు. ఈ జంటకి ఇప్పటికే ఒక కూతురు ఉంది. లాబుషేన్ తన ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో.. వచ్చే ఏప్రిల్‌లో మా కుటుంబంలో మరో సభ్యుడు (అబ్బాయి) చేరబోతున్నాడు. మా కుటుంబం ‘ముగ్గురం నలుగురం కాబోతున్నాం’…
పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోన్న తొలి ఐసీసీ టోర్నమెంట్ కావడంతో ప్రారంభ వేడుకలనూ గ్రాండ్ గా నిర్వహించాలని చూస్తుంది. ఫిబ్రవరి 16 లేదా 17న ఓపెనింగ్ సెర్మనీ ఏర్పాటు చేయనున్నారు. వార్మప్ మ్యాచ్‌లను బట్టి తేదీల్లో మార్పు ఉండే ఛాన్స్ ఉంది. అయితే, ప్రారంభోత్సవానికి ప్రతి టీమ్ కెప్టెన్ హాజరుకావాలి. పాక్‌కు వెళ్లేందుకు భారత సారథికి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో, లేదో తెలియాల్సి ఉంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కోల్పోయిన తన ఫామ్‌ను తిరిగి పొందేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు కోసం తాజాగా రోహిత్ రంజీ జట్టుతో ప్రాక్టీస్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి రోహిత్ ముంబయి రంజీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేకపోవడంతో అతడు జట్టులో చోటు కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పూర్తిగా విఫలమైంది. ఇకపోతే మరోవైపు, రోహిత్ శర్మ ఈ నెల…
Yashasvi Jaiswal: రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్ ఎవరు? అనే అంశం ఇప్పుడు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలోనే రోహిత్ రిటైర్మెంట్పై చర్చ జరిగింది.
Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఘోర వైఫల్యంతో సీనియర్ ప్లేయర్స్ కెరీర్ల మీద నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పర్యటనలోనే రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలా భవితవ్యం మీదా సుధీర్ఘ చర్చ కొనసాగుతుంది.