IND vs NZ Final: నేడే భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్.. గెలిచేదెవరో..!
- నేడే దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్..
- ఫైనల్ పోరులో తలపడబోతున్న భారత్- న్యూజిలాండ్..
- కప్పు ముఖ్యం బిగులు అంటున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. రోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడబోతుంది. ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి. అయితే, న్యూజిలాండ్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆ టీమ్ ను ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌పై కివీస్‌కు మంచి గణంకాలు ఉన్నాయి. అదే నాకౌట్ మ్యాచ్‌ల్లోనైతే ఆ జట్టు ఆధిక్యం 3-1తో ఉంది. మరోవైపు తన అన్ని మ్యాచ్‌లనూ దుబాయ్‌లో భారత్ ఆడడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతోందంటూ ప్రచారం జరుగుతుంది. భారత్‌తో గ్రూప్ మ్యాచ్ ఆడిన న్యూజిలాండ్ కు ఇప్పటికే ఇక్కడ పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. ఫైనల్లో స్పిన్నే మ్యాచ్ విజయాన్ని నిర్దేశించనుంది. స్పిన్ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకున్న జట్టే పైచేయి సాధిస్తుంది. నలుగురు నాణ్యమైన స్పిన్నర్లతో ఈ విభాగంలో భారత్ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. కివీస్ స్పిన్ బౌలింగ్ మెరుగ్గానే ఉంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?
Also Read
- IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
- ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
- IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
- PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ఇక, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. అయితే, పిచ్ మందకొడిగా ఉంటుంది అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు.. 270-280 చేసినా.. మంచి స్కోరే అవుతుంది.. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్‌లో జరిగిన నాలుగు మ్యచ్‌ల్లో సగటు స్కోరు 246 మాత్రమే.
ఇరు జట్లు (అంచనా)
టీమిండియా: రోహిత్ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్/ వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి.
న్యూజిలాండ్: విల్ యంగ్, రచన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, జేమీసన్, హెన్రీ/డఫి, ఒరూర్క్.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!